GOAT Movie: రిలీజ్ కు ముందే దళపతి మూవీ రికార్డ్స్ బ్రేక్.. అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ షేక్..

The Greatest Of All Time Day-1 Advance Bookings: లాస్ట్ ఇయర్ లియో మూవీ తో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ చేసి కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ లెటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(గోట్). ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ జాబితాలో ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ వేరే లెవల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సినిమా 6000 వరకు స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్నది. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఆల్ మోస్ట్ 450 కి పైగా థియేటర్స్ లో విడుదల కానున్నది. ఈ మూవీ రీలీజ్ కు ముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈ సినిమాకు అంతగా ప్రమోషన్స్ లేకున్నా.. భారీ ఓపెనింగ్స్ తో దూసుకపోతుంది. వాస్తవానికి హీరో విజయ్ ఈ మూవీ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఆయన తన రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉండడం.. మరోవైపు మూవీ టీం కూడా ప్రమోషన్స్ పై పెట్టలేదనే చెప్పాలి. కానీ విడుదలకు రెండు రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం దళపతి దళం మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈ మూవీ విజయ్ లియో మూవీని మించిపోతుందని అంచనా వేస్తున్నారు.

Thalapathy Vijay GOAT film set for record box office advance booking

కోలీవుడ్‌లో ది గోట్‌ సినిమాపై భారీ హైప్ ఉండ‌టంతో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జ‌రిగాయి. త‌మిళ‌నాడులో ఇప్ప‌టివ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ 25 కోట్ల‌ను దాటిన‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మ‌రో ఐదు కోట్ల వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఓవ‌ర్‌సీస్‌లో మ‌రో ఇర‌వై ఐదు కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన‌ట్లు తెలిసింది. మొత్తంగా ది గోట్‌ అడ్వాన్స్ బుకింగ్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 55 కోట్ల‌ను దాటిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. విజ‌య్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన సినిమాల్లో ఒక‌టిగా ది గోట్ నిలిచింది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే.. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా మంచి ట్రెండ్ నే చూపిస్తున్నాయి. త‌మిళ‌నాడులో బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండ‌గా తెలుగులో మాత్రం అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. విజ‌య్ గ‌త సినిమాల‌కంటే త‌క్కువ స్థాయిలోనే తెలుగులో బుకింగ్స్ జ‌రుగుతోన్నాయి. చెన్నైలో మొత్తం 554 షోలకు గాను 550 షోలకు టికెట్స్ బుక్ అయ్యాయి. బెంగళూరులో మొత్తం 1,061 షోలకు గాను 245 షోలకు టికెట్స్ సేల్ అయ్యాయి. హైదరాబాద్‌లో 212 షోలకు గాను 20 షోలకు టికెట్లు అమ్ముడైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు మరికొద్దిగంటలు సమయం ఉండటంతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌‌కు టికెట్లు వేగంగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా టాక్‌ను బట్టి బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

Thalapathy Vijay GOAT film set for record box office advance booking

ఇదిలా ఉంటే.. మోస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ది గోట్ మూవీలో హీరో దళపతి విజ‌య్‌ డ్యూయల్ రోల్ లో కనించనున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్‌ మీనాక్షి చౌద‌రి న‌టిస్తోంది. ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, మోహ‌న్‌, స్నేహా, లైలా తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమింటే.. ఈ మూవీ దివంగ‌త కోలీవుడ్ న‌టుడు విజ‌య్ కాంత్‌ను కనిపించనున్నారంట. దివంగత విజయ్ కాంత్ క్లైమాక్స్ లో క‌నిపిస్తారంట, ఏఐ టెక్నాల‌జీతో ఆయన పాత్రకు ప్రాణం పోశారు.

More from Filmibeat

Read more about: goat thalapathy vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X