బిగిల్ వసూళ్ల సునామీ.. విజయ్ కెరీర్‌లో అత్యుత్తమం.. 1.5 రోజుల్లోనే ఎంతంటే..
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బిగిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. రెండు రోజుల్లో భారీ కలెక్షన్లతో విజయ్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ కలెక్షన్లలో ఈ చిత్రం 5వ స్థానంలో నిలువడం విజయ్ స్టామినాకు అద్దం పట్టింది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో ఎంత సాధించిందంటే..

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఓవర్సీస్‌లో విజయ్ సినిమాకు ఎదురులేకుండా పోయింది. ఈ చిత్రం అమెరికాలో 900K దాటింది. ఆదివారం 1 మిలియన్ డాలర్ వసూళ్ల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది. యూకేలో కూడా విజయ్ హవా కొనసాగుతున్నది. రెండు రోజుల్లోనే 261732 పౌండ్స్‌ను వసూలు చేసింది. ఓవర్సీస్ విజృంభణతో విజయ్ చిత్రం అత్యంత వేగంగా 100 కోట్లలో చేరిన చిత్రంగా రికార్డుకెక్కింది.

7వ 100 కోట్ల చిత్రం
ఇక విజయ్ కెరీర్‌ను చూస్తే ఇది 7వ వందకోట్ల మార్కు దాటిన చిత్రంగా నిలిచింది. భైరవ 4 రోజుల్లో, మెర్సల్ మూడు రోజుల్లో, సర్కార్ చిత్రం 2 రోజుల్లో బిగిల్ చిత్రం 2 రోజుల్లోనే దాటడం విశేషంగా మారింది. దాంతో అభిమానులు కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అని చెప్పుకొంటున్నారు.
Recommended Video

విజయ్ వంద కోట్ల సినిమాలు
విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తుపాకీ రూ.118 కోట్లు, కత్తి 132 కోట్లు, థెరీ రూ.162 కోట్లు, మెర్సల్ రూ.250 కోట్లు, సర్కార్ రూ.260 కోట్లు, బిగిల్ 120 కోట్లు కేవలం రెండు రోజుల్లో సాధించింది. సర్కారు చిత్రం రెండు రోజుల్లో రూ.100 కోట్లు సాధించడం గమనార్హం.

ఏపీ, కన్నడ, తమిళంలో
బిగిల్ చిత్రం ఇతర భాషల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నది. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.10 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇలా మూడు రోజుల్లో రాబట్టడం విజయ్ కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచింది. ఇక కృష్ణా జిల్లాలో 32 షోలు ప్రదర్శిస్తే రూ.16.7 లక్షలు రాబట్టింది. తొలి రోజే రూ.10.5 లక్షలు రాబట్టడం విశేషం అని ట్రేడ్ వర్గాలు వివరించాయి.

ఇండియా వైడ్ ట్రెండింగ్
విజయ్ ఫెర్ఫార్మెన్స్, ఎమోషన్స్ బాగా పడటంతో సినిమాకు సగటు ప్రేక్షకుడిని నుంచి ఆదరణ భారీగా లభిస్తున్నది. దాంతో బాలీవుడ్‌లో సల్మాన్ బాద్షా అయితే.. దక్షిణాదిలో విజయ్ బాద్షా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇక ఇండియాలో #BIGILHitsMassive100CRs అనే ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











