twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెర్సల్ కలెక్షన్ల సింహ గర్జన.. ఓవర్సీస్‌లో రజనీ, షారుక్ రికార్డులకు పోటీగా..

    By Rajababu
    |

    Recommended Video

    ఓవర్సీస్‌లో కలెక్షన్ల సింహ గర్జన..

    వివాదాస్పద చిత్రంగా మారిన మెర్సల్ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కలెక్షన్లపరంగా దుమ్ము రేపుతున్నది. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మెర్సల్ ఓ రికార్డు క్రియేట్ చేసింది. తమిళనాడు బాక్సాఫీస్‌నే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌ను కుదిపేస్తున్నది. గత 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

     ఓవర్సీస్‌లో మెర్సల్

    ఓవర్సీస్‌లో మెర్సల్

    గత 12 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే కేవలం ఓవర్సీస్ మార్కెట్‌లోనే రూ.72 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫ్రాన్స్, మలేషియాలో రికార్డు కలెక్షన్లను సాధించడం సినీ వర్గాల్లో ఆశ్చర్య రేపుతున్నది.

     ఫ్రాన్స్‌లో రికార్డు కలెక్షన్లు

    ఫ్రాన్స్‌లో రికార్డు కలెక్షన్లు

    గతంలో విజయ్ చిత్రాలకు ఫ్రాన్స్‌లో మంచి ఆదరణ లభించింది. కానీ మెర్సల్ వసూలు చేస్తున్న కలెక్షన్లు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతున్నది. రజనీకాంత్ నటించిన కబాలీ, రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రాల తర్వాత మెర్సల్ మూడో స్థానంలో నిలిచింది.

    10కే క్లబ్‌లో మెర్సల్

    10కే క్లబ్‌లో మెర్సల్

    ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో లీ గ్రెనేడ్ రెక్స్ అనే థియేటర్‌లో మెర్సల్ రిలీజ్ అయింది. ఈ సినిమా హాల్‌ కెపాసిటీ 2000 సీట్లు. ఇప్పటికీ మెర్సల్ ఈ థియేటర్‌లో 100% ఆక్యుపెన్సీతో దూసుకెళ్తున్నది. ఫ్రాన్స్‌లో 10కే క్లబ్ చేరిన విజయ్ మూడో చిత్రంగా ఘనతను సాధించింది.

     మలేషియాలో 17 కోట్లు

    మలేషియాలో 17 కోట్లు

    ఇక మలేషియాలో మెర్సల్ రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తున్నది. మలేషియాలో ఈ చిత్రం గత 12 రోజుల్లో 17 కోట్లు వసూలు చేసింది. ఆ దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన రెండో తమిళ చిత్రంగా మెర్సల్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అత్యధిక వసూళు సాధించిన చిత్రంగా కబాలి తొలిస్థానంలో నిలిచింది.

     షారుక్, రజనీ తర్వాత

    షారుక్, రజనీ తర్వాత

    మలేషియాలో భారతీయ చిత్రాల రికార్డులు పరిశీలిస్తే తొలి రెండు స్థానాల్లో రజనీకాంత్ నటించి కబాలీ, షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాల తర్వాత మెర్సల్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.

     ప్రపంచవ్యాప్తంగా 211 కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా 211 కోట్లు

    ఇదిలా ఉండగా, మెర్సల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 211.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. స్వదేశంలో 139.52 కోట్లు, ఓవర్సీస్‌లో 71.9 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెర్సల్ రూ.102 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది.

    English summary
    Thalapathy Vijay‘s Mersal is easily one of the highest grossers of 2017. Apart from its phenomenal performances at the Tamil Nadu box office, Mersal has been creating waves overseas. While the film has collected Rs. 71.8 crores from the overseas markets alone in 12 days. Mersal in Malaysia stands at MYR 11 million+ (Rs 17 crores).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X