‘రంగస్థలం’తో పాటు సౌత్ రికార్డులన్నీ బద్దలు.. 10 రోజుల్లో ఫసక్!

తమిళ స్టార్ విజయ్ నటించిన 'సర్కార్' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించగా... 10 రోజులు పూర్తయక్యే సమయానికి సౌత్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది.

ఒక్క తమిళనాడులోనే ఓపెనింగ్ డే రూ. 30.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.... కోలీవుడ్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. దీపావళి సందర్భంగా నవంబర్ 6న రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యప్తంగా ఇప్పటి వరకు రూ. 220 కోట్లు రాబట్టింది.

10 రోజుల్లోనే ‘రంగస్థలం' రికార్డ్ బద్దులు

10 రోజుల్లోనే ‘రంగస్థలం' రికార్డ్ బద్దులు

2018 సంవత్సరంలో రూ. 218 కోట్ల వసూళ్లతో రామ్ చరణ్ ‘రంగస్థలం' చిత్రం సౌత్ ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ రికార్డును విజయ్ మూవీ కేవలం 10 రోజుల్లోనే బద్దలు కొట్టేయడం గమనార్హం.

రూ. 100 కోట్లు సాధించిన 6వ చిత్రం

రూ. 100 కోట్లు సాధించిన 6వ చిత్రం

మరో వైపు విజయ్ కెరీర్లో రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ సాధించి 6వ సినిమా ఇది. విజయ్ నటించిన గత 4 చిత్రాలు పరిశీలిస్తే తేరి, భైరవ, మెర్సల్, సర్కార్ ఇలా అన్నీ కూడా వరుసగా వంద కోట్లకుపైగా వసూలు చేసి విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో నిరూపించాయి.

మిక్డ్స్ టాక్ ఉన్నప్పటికీ

మిక్డ్స్ టాక్ ఉన్నప్పటికీ

‘సర్కార్' సినిమా విడుదల రోజే మిక్డ్స్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ బావున్నప్పటికీ సెకండాఫ్‌లో ఓవర్ పొలిటికల్ డ్రామా చూపించారనే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు సైతం ముసురుకున్నాయి. అన్నింటినీ అధిగమించి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది.

విజయ్

విజయ్

ఈ చిత్రంలో విజయ్ కార్పొరెట్ కంపెనీ సీఈఓగా నటించారు. ఓటు వేయడానికి ఇండియా వచ్చిన అతడు తన ఓటు అప్పటికే ఇంకొరు వేసారని తెలిసి షాకవుతాడు. పొలిటికల్ సిస్టం మార్చాలని డిసైడ్ అయిన అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథతో ఈ చిత్రం సాగుతుంది.

ఇక్కడ ఆదరణ కరువు

ఇక్కడ ఆదరణ కరువు

అయితే ‘సర్కార్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. తెలుగు రైట్స్ రూ. 7 కోట్లకు అమ్మగా రూ. 6 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో కూడా సర్కార్‌కు చేదు అనుభవం ఎదురైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X