Leo Advance Booking Collecions ఓవర్సీస్‌లో విజయ్ కలెక్షన్ల రచ్చ.. నెల ముందే మాస్ బుకింగ్స్!
తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుామర్, జగదీష్ పళనిస్వామి నిర్మించిన చిత్రం లియో. ఈ సినిమా దసరా పండుగ కానుకగా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ కాకుండానే బాక్సాఫీస్ వద్ద సందడి ప్రారంభించింది. ఓవర్సీస్‌లో ఇప్పటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. భారీగా రెస్పాన్స్ వస్తున్నది. లియో సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇళయ దళపతి విజయ్ కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అత్యాధునిక సాంకేతికతో అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా లియోను ఐమాక్స్, 4DX, ఇతర ప్రీమియమ్ ఫార్మాట్లలో నిర్మిస్తున్నారు.

ఇక లియో సినిమాలో నటించినందుకు విజయ్‌కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. ఈ సినిమాలో నటించినందుకు విజయ్ తన పారితోషికంగా 120 కోట్ల రూపాయలు తీసుకొనున్నట్టు ట్రేడ్ వర్గాల్లోప్రచారం జరుగుతున్నది. ఈ సినిమా కోసం బిజినెస్, ఫ్రాఫిట్ షేరింగ్‌తో ప్రాతిపాదికన అగ్రిమెంట్ చేసుకొన్నారు. 50 శాతం మొత్తం అడ్వాన్సుగా, మరో 50 శాతాన్ని బిజినెస్, ప్రాఫిట్‌లో షేరింగ్‌గా తీసుకోనున్నట్టు తెలిసింది.
లియో సినిమాను పాన్ ఇండియా మూవీగా కాకుండా కేవలం తమిళ ప్రేక్షకుల టార్గెట్‌గా రూపొందిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
అయితే లియో సినిమా రిలీజ్‌కు నెలకుపైగా సమయం ఉండగా.. ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టారు. ప్రధానంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను యూకేలో మొదలుపెట్టారు. యూకేలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది.
లియో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. తొలి రోజు కోసం మొదలైన బుకింగ్‌లో రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తొలి రోజు కోసం ఇప్పటికే 13 వేల టికెట్లు అమ్ముడుపోగా 130K పౌండ్స్ అంటే 1.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారాంతానికి అంటే 4 రోజుల కోసం 18250 టికెట్లు అమ్ముడుపోగా 185K పౌండ్స్ అంటే.. 1.9 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.


Click it and Unblock the Notifications











