For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  250 కోట్ల వైపు 'సర్కార్' పరుగులు.. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ సునామి లెక్క ఇది!

  |
  Vijay's Sarkar Box Office Collections : Sarkar Collections Are Still Continuing To Rise | Filmibeat

  ఇళయ దళపతి విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. మురుగదాస్ దర్శత్వంలో తెరకెక్కిన సర్కార్ చిత్రం రెండు వారాల తరువాత కూడా బాక్సాఫీస్ దూకుడు ఆగడం లేదు. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇది. గతంలో కత్తి, తుపాకీ లాంటి ఘనవిజయం సాధించిన చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. సర్కార్ చిత్రం విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకుంది. భారీ హైప్ రావడానికి ఒకరకంగా వివాదాలు కూడా ఉపయోగపడ్డాయి. ఎప్పటిలాగే విజయ్ ఈ చిత్రంలో కూడా అభిమానులని సంతృప్తి పరిచాడు. మురుగదాస్ దొంగ ఓట్ల కాన్సెప్ట్, సెక్షన్ 49పి జనాలకు నచ్చేయడంతో సర్కార్ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సర్కార్ చిత్ర తాజా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  'రంగస్థలం'తో పాటు సౌత్ రికార్డులన్నీ బద్దలు.. 10 రోజుల్లో ఫసక్!

  250 కోట్ల మార్క్‌కు చేరువలో

  250 కోట్ల మార్క్‌కు చేరువలో

  తొలి వీకెండ్ ముగిసేసమయానికే 100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్న సర్కార్ చిత్రం రెండవ వారం మొదలైన తరువాత 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఎన్ని వివాదాలు ఎదురైనా ఏదశలోనూ ఈచిత్ర వసూళ్లు తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు సర్కార్ చిత్రం విజయవంతంగా మూడవ వారం లోకి అడుగుపెడుతోంది. ఈ దశలో సర్కార్ చిత్ర తాజా వసూళ్లు 250 కోట్ల మార్క్ కు చేరువైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సర్కార్ చిత్రం 247 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.

  తొలిరోజు అదిరిపోయేలా

  తొలిరోజు అదిరిపోయేలా

  సర్కార్ చిత్రం తొలిరోజు కేవలం తమిళనాడులోనే 31 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా తొలిరోజు గ్రాస్ 70 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజుతో పోచుకుంటే సర్కార్ చిత్ర వసూళ్లు పెద్దగా బలహీనపడినట్లు కనిపించడం లేదు. బరిలో మరో భారీ చిత్రం లేకపోవడం కూడా కలసి వచ్చే అంశం. సంచలనాలు సృష్టిస్తుందని భావించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం చతికిల బడడంతో సర్కార్ కు తిరుగులేకుండా పోయింది.

  విజయ్ మూడవసారి

  విజయ్ మూడవసారి

  ఇక అమెరికాలో కూడా సర్కార్ కు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఒక మిలియన్ మార్క్ ని అధికమించినట్లు తెలుస్తోంది. తేరి, మెర్సల్ చిత్రాల తరువాత మూడోసారి విజయ్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం ఇండియాలోనే సర్కార్ చిత్రం 180 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందట. సర్కార్ చిత్రాన్ని అత్యధికంగా 80 దేశాల్లో విడుదల చేశారు. 3000 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

  వివాదాలు

  వివాదాలు

  సర్కార్ చిత్రానికి ఆరంభంనుంచే వివాదాలు ఎదురయ్యాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అన్నా డీఎంకే ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద వివాదం సృష్టించారు. ఆ పార్టీ కార్యకర్తలు థియేటర్స్ పై దాడులకు తెగబడ్డారు. చివరకు వివాదాస్పద సన్నివేశాలు తొలగించడంతో గొడవ ఆగింది. ఎన్ని చేసిన సర్కార్ చిత్ర ఘనవిజయాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోయారు.

  కీలక పాత్రల్లో

  కీలక పాత్రల్లో

  ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కోమలవల్లిగా ప్రతినాయక పాత్రలో నటించింది. రాధారవి కీలక పాత్రలో నటించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం విజయ్ యువ సంచలనం అట్లీ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. వీళ్లిద్దరికీ కూడా ఇది హ్యాట్రిక్ మూవీనే.

  తెలుగులో తొలి హిట్

  తెలుగులో తొలి హిట్

  విజయ్ తమిళంలో తిరుగులేని స్టార్ హీరో. కానీ మిగిలిన తమిళ హీరోలతో పోల్చుకుంటే తెలుగులో విజయ్ మార్కెట్ చాలా తక్కువ. సర్కార్ చిత్రం విజయ్ తెలుగు మార్కెట్ ని పెంచేదే అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ఎపి, తెలంగాణాలో 7 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారంలోనే 7 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విజయ్ కు తెలుగు గడ్డపై తొలి విజయం ఖరారైంది.

  English summary
  Sarkar Box Office Collection: Thalapathy Vijay starrer set to cross whopping Rs 250 crore mark. Sarkar becomes third film of Thalapathy Vijay to enter the million dollar club at the American box office
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X