Thamma Boxe Office Collections: షాకింగ్‌గా థామా బాక్సాఫీస్ కలెక్షన్లు.. రష్మిక మందన్న మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థామా. యువ దర్శకుడు ఆదిత్య సర్పోదార్ రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి లాంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించారు. మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో పెన్ మరుదార్, ఓవర్సీస్‌లో యష్ ఫిలింస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పాటలు, ప్రమోషనల్ వర్క్‌కు భారీ స్పందన లభించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నిలిచాయి. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

థామా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నోరా ఫతేహి, మలైకా అరోరా, అమర్ కౌశిక్, వరుణ్ ధావన్, అనీత్ పడ్డా లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న లాంటి స్టార్స్ నటించడంతో బడ్జెట్ భారీగానే అయింది. ప్రతిభావంతులైన టెక్నిషియన్స్ పనిచేయడంతో ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. ధాంతో ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
థామా సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. రిలీజ్‌కు ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అమ్మకాల వల్ల ఈ సినిమా బడ్జెట్‌లో 50 శాతం రికవరీ సాధించింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ 150 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సిన అవసరం బాక్సాఫీస్ వద్ద ఏర్పడింది.
రష్మిక నటించిన గత రెండు చిత్రాలు యానిమల్, ఛావా బ్లాక్ బస్టర్లుగా నిలువడంతో ఈ సినిమా హాట్ హాట్‌గా మారింది. దాంతోపాటు ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా భారీగా వర్కువట్ అవ్వడంతో క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఈ సినిమాకు తొలి రోజు భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా తొలి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే సుమారుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా తొలి రోజు 10 నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు, సాక్ నిక్ అంచనా వేస్తున్నది.
ఇక రష్మిక నటించిన యానిమల్ చిత్రం తొలి రోజు 116 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ 2 మూవీ 11 కోట్ల రూపాయలు, బాలా 10 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా ఆయష్మాన్ ఖురానా కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమనే ఘనతను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











