Thamma Day 2 Collections: 50 కోట్లకు చేరువగా థామా.. రష్మిక మందన్న మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థామా. యువ దర్శకుడు ఆదిత్య సర్పోదార్ రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి లాంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించారు. మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో పెన్ మరుదార్, ఓవర్సీస్‌లో యష్ ఫిలింస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పాటలు, ప్రమోషనల్ వర్క్‌కు భారీ స్పందన లభించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నిలిచాయి. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

థామా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నోరా ఫతేహి, మలైకా అరోరా, అమర్ కౌశిక్, వరుణ్ ధావన్, అనీత్ పడ్డా లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న లాంటి స్టార్స్ నటించడంతో బడ్జెట్ భారీగానే అయింది. ప్రతిభావంతులైన టెక్నిషియన్స్ పనిచేయడంతో ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. ధాంతో ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రోమోలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం తొలి రోజే 24 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది రష్మిక నటించిన సినిమాల్లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ అంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం సింగం అగైన్, భూల్ భులయ్యా 3 చిత్రాలతో పోటీ పడుతూ వసూళ్లపై గురి పెట్టింది.
ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా గ్రాండ్‌గా ఓపెన్ అయింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణె, హైదరాబాద్ నగరాల్లో కోల్‌కతా, చెన్నై లాంటి ప్రాంతాల్లో 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది అని ట్నేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, థామా చిత్రం రెండో రోజు కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికీ.. తొలి రోజుతో పోటీ పడుతూ వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా రెండో రోజు 15 నుంచి 20 కోట్ల మధ్య కలెక్షన్లు సాధించవచ్చు. ఈ సినిమ రెండు రోజుల్లో 40 కోట్ల మేర వసూళ్లను నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3వ రోజు నాటికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











