Thamma Day 3 Collections: థామాకు షాకింగ్ కలెక్షన్స్.. రష్మిక మందన్న మూవీకి ఎన్ని కోట్లంటే?

ఈ ఏడాది చావా, స్కై ఫోర్స్, బుల్ చుక్ మాఫ్, టెహ్రాన్, పరం సుందరి వంటి సినిమాలతో ఊపు మీదున్న బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మడోక్ ఫిలింస్ బ్యానర్‌ తాజాగా నిర్మించిన చిత్రం థామా. దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించగా.. ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించారు. మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న లీడ్ రోల్స్ పోషించగా.. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి తదితరులు గెస్ట్ రోల్స్‌లో మెరిశారు.

థామా తారాగణం
నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. థామా సినిమాకు సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. ఈ నేపథ్యంలో థామా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Thamma Movie day 3 Box Office Collections Worldwide Rashmika Mandanna Movie drops on the third day

థామా బడ్జెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో థామా చిత్రంపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు రష్మిక లుక్ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి థామా చిత్రానికి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అంచనాల నేపథ్యంలో థామాను వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్స్‌లో ప్రదర్శించారు. తొలి రోజు ఏకంగా 12000 షోలు ప్రదర్శితమైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

థామా రెండ్రోజుల కలెక్షన్స్
థామాకు ఇండియా వైడ్‌గా తొలిరోజున 24 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజున 18.6 కోట్ల వసూళ్లు వచ్చాయి. దాంతో రెండ్రోజుల్లో ఈ సినిమా ఇండియాలో 42.6 కోట్ల రూపాయల నికర వసూళ్లను, 51 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుంది. కేవలం రెండ్రోజుల్లో థామా 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఓవర్సీస్‌లో థామాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ప్ తదితర దేశాలతో కలిపి థామాకు ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ సినిమాకు రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

థామా మూడవ రోజు కలెక్షన్స్
దీపావళి సెలవులు ముగియడంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో థామాకు బుకింగ్స్ పడిపోయాయి. మూడో రోజున సాయంత్రం 3 గంటల వరకు రష్మిక మందన్న సినిమాకు హిందీలో 8 శాతం, తెలుగులో 9 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. మూడో రోజు థామా చిత్రానికి తెలుగులో 40 లక్షల రూపాయలు, హిందీలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 1 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల వరకు థామా మూవీకి వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X