Thamma Day 4 Collections: 100 కోట్ల కలెక్షన్స్ దిశగా థామా.. రష్మిక మందన్న మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?
మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం థామా. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి తదితరులు గెస్ట్ రోల్స్‌లో నటించారు. థామా సినిమాకు సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ సంగీత దర్శకత్వం వహించారు. అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో థామా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
థామా బడ్జెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో థామా చిత్రంపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి థామా చిత్రానికి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో థామాను వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్స్‌లో ప్రదర్శించారు. తొలి రోజు ఏకంగా 12000 షోలు ప్రదర్శితమైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

థామా మూడు రోజుల కలెక్షన్స్
థామాకు ఇండియా వైడ్‌గా తొలిరోజున 24 కోట్ల రూపాయలు, రెండో రోజున 18.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 13 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు వచ్చాయి. దాంతో మూడు రోజుల్లో ఈ సినిమాకు ఇండియాలో 55.6 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 66.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లో థామాకు సాలీడ్ కలెక్షన్స్ వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాంతార చాప్టర్ 1, డ్యూడ్ తదితర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ నార్త్ అమెరికాలో ఈ సినిమాకు బాగానే బుకింగ్స్ జరుగుతున్నాయి.
అక్టోబర్ 22వ తేదీ వరకు థామాకు నార్త్ అమెరికాలో 154K కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇది ఏడో రోజు నాటికి 2 లక్షల డాలర్లకు (భారత కరెన్సీలో 1.75 కోట్ల రూపాయలు) చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ప్ తదితర దేశాల నుంచి 8 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో కలిపి థామాకు ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ సినిమాకు మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 76.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థామాకు తొలి రోజున 25 లక్షల రూపాయలు, రెండో రోజున 10 లక్షల రూపాయలు, మూడో రోజున 10 లక్షల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి.
థామా నాలుగవ రోజు కలెక్షన్స్
వర్కింగ్ డేస్ కావడంతో థామాకు తెలుగు, హిందీ రెండు చోట్ల బుకింగ్స్ భారీగా పడిపోయాయి. అయితే వీకెండ్ ప్రారంభం కానుండంతో శుక్రవారం బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో రోజున రాత్రి 8 గంటల వరకు రష్మిక మందన్న సినిమాకు హిందీలో 12 శాతం, తెలుగులో 13 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. నాలుగో రోజు థామా చిత్రానికి తెలుగులో 40 లక్షల రూపాయలు, హిందీలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రష్మిక మందన్న చిత్రం 100 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తోంది.


Click it and Unblock the Notifications











