Thamma Day 4 Collections: 100 కోట్ల క్లబ్ వైపు థామా.. రష్మిక మందన్న మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థామా. యువ దర్శకుడు ఆదిత్య సర్పోదార్ రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి లాంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించారు. మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో పెన్ మరుదార్, ఓవర్సీస్‌లో యష్ ఫిలింస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పాటలు, ప్రమోషనల్ వర్క్‌కు భారీ స్పందన లభించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నిలిచాయి. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Thamma Box Office

థామా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నోరా ఫతేహి, మలైకా అరోరా, అమర్ కౌశిక్, వరుణ్ ధావన్, అనీత్ పడ్డా లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న లాంటి స్టార్స్ నటించడంతో బడ్జెట్ భారీగానే అయింది. ప్రతిభావంతులైన టెక్నిషియన్స్ పనిచేయడంతో ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. ధాంతో ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రోమోలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం తొలి రోజే 25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రెండో రోజు ఈ చిత్రం 20 కోట్ల రూపాయలు, మూడో రోజు 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 3 రోజుల్లో 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

హారర్, థ్రిల్లర్ మూవీగా రూపొందిన థామా చిత్రానికి ఓవర్సీస్‌లో ఓ మాదిరి కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం 600K డాలర్లు అంటే.. సుమారుగా 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 65 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.

ఇక ఈ చిత్రం 4వ రోజు నిలకడగా మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణె, హైదరాబాద్ నగరాల్లో కోల్‌కతా, చెన్నై లాంటి ప్రాంతాల్లో 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ ఈ సినిమా 4వ రోజు 5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టలింది అని ట్నేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నాలుగో రోజు 70 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X