Thamma Day 5 Collections: 100 కోట్ల క్లబ్‌లోకి థామా... రష్మిక మందన్న మూవీకి 5వ రోజు ఎన్ని కోట్లంటే?
యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న రష్మిక మందన్న తాజాగా నటించిన చిత్రం హార్రర్. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటించారు. ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి వంటి స్టార్స్ అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు. థామా సినిమాకు సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ సంగీత దర్శకత్వం వహించారు. అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో థామా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు థామా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
థామా బడ్జెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో థామా చిత్రంపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి థామా చిత్రానికి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో థామాను వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్స్‌లో ప్రదర్శించారు. తొలి రోజు ఏకంగా 12000 షోలు ప్రదర్శితమైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

థామా నాలుగు రోజుల కలెక్షన్స్
థామాకు ఇండియా వైడ్‌గా తొలిరోజున 24 కోట్ల రూపాయలు, రెండో రోజున 18.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 13 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు వచ్చాయి. దాంతో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఇండియాలో 65.6 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 78.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్ నుంచి థామా చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో మద్ధతు లభిస్తోంది. గురువారం ఒక్కరోజే నార్త్ అమెరికాలో థామాకు 82K (భారత కరెన్సీలో దాదాపు 72 లక్షల రూపాయలు) కలెక్షన్స్ వచ్చాయి. గురువారం వరకు అమెరికా, కెనడాలలో రష్మిక మందన్న మూవీకి 336K (భారత కరెన్సీలో 2.95 కోట్ల రూపాయలు) వసూళ్లు వచ్చినట్లు నివేదికలు తెలిపాయి. ఇది శుక్రవారం నాటికి 3.40 కోట్ల రూపాయలకు చేరి ఉంటుందని అంచనా.
అలాగే యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ప్ తదితర దేశాల నుంచి థామాకు 7.70 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలిపి రష్మిక మందన్న మూవీకి ఓవర్సీస్‌లో నాలుగు రోజుల వరకు 11.30 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 90 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్ నిక్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో థామాకు తొలి రోజున 25 లక్షల రూపాయలు, రెండో రోజున 10 లక్షల రూపాయలు, మూడో రోజున 10 లక్షల రూపాయలు, నాలుగో రోజున 10 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.
థామా 5వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో రష్మిక మందన్న మూవీకి బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోలకు మంచి ఆక్యూపెన్సీ నమోదవుతుందని భావిస్తున్నారు. ఐదవ రోజు సాయంత్రం 4 గంటల వరకు థామాకు హిందీలో 10 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఐదో రోజు థామా చిత్రానికి తెలుగులో 70 లక్షల రూపాయలు, హిందీలో 12 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రష్మిక మందన్న చిత్రం శనివారం 100 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











