Thamma Day 6 Collections: వీకెండ్‌లో థామా ధమాకా.. రష్మిక మందన్న మూవీకి 6వ రోజు ఎన్ని కోట్లంటే?
మడోక్ ఫిలింస్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన మూవీ థామా. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానాలు హీరో హీరోయిన్లుగా నటించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహిలు గెస్ట్ రోల్‌లో ఆకట్టుకున్నారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించారు. థామా సినిమాకు సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ సంగీత దర్శకత్వం వహించారు. అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో థామా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు థామా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
థామా బడ్జెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో థామా చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి థామా చిత్రానికి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి . రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానాల మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. . భారీ అంచనాల నేపథ్యంలో థామాను వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు.

థామా ఐదు రోజుల కలెక్షన్స్
థామాకు ఇండియా వైడ్‌గా తొలిరోజున 24 కోట్ల రూపాయలు, రెండో రోజున 18.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 13 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10 కోట్ల రూపాయలు, ఐదో రోజున 13 కోట్ల రూపాయల చొప్పున వసూళ్లు వచ్చాయి. దాంతో ఐదు రోజుల్లో థామా సినిమాకు ఇండియాలో 78.6 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 94.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్ నుంచి 11.3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి థామా మూవీకి 5 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 105.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 5 రోజుల్లో 117 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పలువురు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో థామాకు తొలి రోజున 25 లక్షల రూపాయలు, రెండో రోజున 10 లక్షల రూపాయలు, మూడో రోజున 10 లక్షల రూపాయలు, నాలుగో రోజున 10 లక్షల రూపాయలు, ఐదో రోజున 10 లక్షల రూపాయల కలెక్షన్స్ చొప్పున 65 లక్షల రూపాయలు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు హిందీలో 83 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి 40 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు, కర్ణాటక + తమిళనాడు+ కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు చొప్పున గ్రాస్ వసూలు చేసింది.
థామా 6వ రోజు కలెక్షన్స్
ఆదివారం రష్మిక మందన్న మూవీకి సాలీడ్‌గా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆదివారం హిందీ బెల్ట్‌తో పాటు తెలుగులోనూ కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఆరవ రోజు సాయంత్రం 5 గంటల వరకు థామాకు హిందీలో 20 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆదివారం సాయంత్రం వరకు థామాకు ఇండియాలో 5.79 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ షో, సెకండ్ షో తర్వాత వసూళ్లు బాగుంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆరవ రోజు థామా చిత్రానికి తెలుగులో 70 లక్షల రూపాయలు, హిందీలో 12 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











