Thamma Day 7 Collections: 100 కోట్లు కొల్లగొట్టిన థామా.. రష్మిక మూడో బాక్సాఫీస్ సంచలనం!

బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థామా. యువ దర్శకుడు ఆదిత్య సర్పోదార్ రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి లాంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించారు. మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో పెన్ మరుదార్, ఓవర్సీస్‌లో యష్ ఫిలింస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పాటలు, ప్రమోషనల్ వర్క్‌కు భారీ స్పందన లభించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నిలిచాయి. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Thamma Movie Day 7 Box Office

థామా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నోరా ఫతేహి, మలైకా అరోరా, అమర్ కౌశిక్, వరుణ్ ధావన్, అనీత్ పడ్డా లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న లాంటి స్టార్స్ నటించడంతో బడ్జెట్ భారీగానే అయింది. ప్రతిభావంతులైన టెక్నిషియన్స్ పనిచేయడంతో ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. ధాంతో ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

థామా చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయల భారీ టార్గెట్‌తో వసూళ్ల యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజు 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే జోష్‌తో రెండో రోజు 20 కోట్లు రాబట్టింది. మూడో రోజు 15 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 13 కోట్ల రూపాయలు, ఐదో రోజు ఈ సినిమా 16 కోట్ల రూపాయలు, ఆరో రోజు 13 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 89 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారుగా 2 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 18 కోట్ల రూపాయలు వసూలుచేసింది. దాంతో ఈ చిత్రం 107 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఇటీవల కాలంలో రష్మిక మందన్న నటించిన మూడు చిత్రాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. యానిమల్, ఛావా చిత్రాలు కూడా ఈ ఘనతను సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 7వ రోజు కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమా 7వ రోజు 4 నుంచి 5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల దిశగా పరుగులు పెడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X