Thamma Day 8 Collections: అక్షయ్ కుమార్ రికార్డ్‌పై రష్మిక మందన్న గురి... థామాకు 8వ రోజు ఎన్ని కోట్లంటే?

వరుస విజయాలతో ఊపు మీదున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నటించిన చిత్రం థామా. ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహిలు గెస్ట్ రోల్‌లో ఆకట్టుకున్నారు. మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. థామా సినిమాకు సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ సంగీత దర్శకత్వం వహించారు. మడోక్ ఫిలింస్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజైంది. ఈ నేపథ్యంలో థామా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 8వ రోజు థామా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

థామా బడ్జెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో థామా చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి థామా చిత్రానికి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ కామెడీ హర్రర్ మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. .భారీ అంచనాల నేపథ్యంలో థామాను వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు.

Thamma Movie day 8 Box Office Collections Worldwide Rashmika Mandanna s Movie eye on Kesari Chapter 2 record

థామా 7 రోజుల కలెక్షన్స్
థామాకు ఇండియా వైడ్‌గా తొలిరోజున 24 కోట్ల రూపాయలు, రెండో రోజున 18.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 13 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10 కోట్ల రూపాయలు, ఐదో రోజున 13 కోట్ల రూపాయలు, ఆరో రోజున 12.6 కోట్ల రూపాయలు, ఏడో రోజున 4.3 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. దాంతో ఏడు రోజుల్లో థామాకు ఇండియాలో 95.6 కోట్ల రూపాయల నెట్, 114.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌‌నిక్ తెలిపింది.

ఓవర్సీస్‌లో థామా వసూళ్లు పరిశీలిస్తే.. అక్టోబర్ 26 వరకు అందిన వివరాల ప్రకారం నార్త్ అమెరికాలో రష్మిక మందన్న మూవీకి 750K డాలర్లు (భారత కరెన్సీలో 6.62 కోట్ల రూపాయలు) వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మిగిలిన దేశాల నుంచి 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో థామాకు 7 రోజుల వరకు ఓవర్సీస్‌లో 17.15 కోట్ల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి థామా మూవీకి 7 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 132 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో థామాకు తొలి రోజున 25 లక్షల రూపాయలు, రెండో రోజున 10 లక్షల రూపాయలు, మూడో రోజున 10 లక్షల రూపాయలు, నాలుగో రోజున 10 లక్షల రూపాయలు, ఐదో రోజున 10 లక్షల రూపాయలు, ఆరో రోజున పది లక్షల రూపాయలు, ఏడో రోజున 5 లక్షల రూపాయల కలెక్షన్స్ చొప్పున 75 లక్షల రూపాయల నెట్ వసూళ్లు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు హిందీలో 95.6 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 17.15 కోట్ల రూపాయలు వచ్చాయి.

థామా 8వ రోజు కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉన్నప్పటికీ థామాకు సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. వీకెండ్‌ను విజయవంతంగా ముగించిన రష్మిక మందన్నా మూవీ వర్కింగ్ డెస్‌లోనూ సత్తా చాటుతూ మండే టెస్ట్ పాసైంది. 8వ రోజున మంగళవారం థామా మూవీకి సాయంత్రం 6 గంటల వరకు హిందీలో 13 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో 8వ రోజు థామా మూవీకి వరల్డ్ వైడ్‌గా 4.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరో 14 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడితే అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 (145.73 కోట్ల రూపాయలు) లైఫ్ కలెక్షన్స్‌ను బద్ధలు కొడుతుంది. అలాగే రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాపీస్ వద్ద మరో 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X