Thammudu Closing Collections: తమ్ముడు క్లోజింగ్ కలెక్షన్స్.. 75 కోట్లతో తీస్తే.. నితిన్ ఎంత రాబట్టాడంటే?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ తమ్ముడు చిత్రాన్ని నిర్మించారు. నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మలు కీలకపాత్రలు పోషించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను డైరెక్ట్ చేసిన వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా తమ్ముడు విడుదలైంది. తమ్ముడు సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈసారి కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తమ్ముడు సినిమాకు ఓకే చెప్పారు. దిల్‌రాజ్ బ్యానర్ కావడంతో పాటు వేణు శ్రీరామ్ డైరెక్టర్ కావడంతో తమ్ముడు చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ కార్యక్రమాల్లో దిల్‌రాజు స్వయంగా పాల్గొని చిత్ర యూనిట్‌కు సహకరించారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో తమ్ముడు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తమ్ముడు బడ్జెట్ ఎంత?
సీనియర్ నటి లయ ఈ చిత్రంతో తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫేం హరితేజ, యానిమల్ ఫేం సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ, జబర్దస్త్ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. కాంతార చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.
తమ్ముడు బిజినెస్ ఎంత?
దిల్‌రాజు బ్యానర్, వేణుశ్రీరామ్ డైరెక్షన్ కావడంతో తమ్ముడు మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి అనుగుణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాం ఏరియాలో 8.5 కోట్ల రూపాయలు.. సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయల చొప్పున తమ్ముడు చిత్రానికి ఆంధ్రా, నైజాంలలో 20 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో 4 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీనితో కలుపుకుని తమ్ముడు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నితిన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. తమ్ముడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

తమ్ముడు కలెక్షన్స్
రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న తమ్ముడు మూవీ ఇండియా వైడ్ తొలి రోజు రూ.1.9 కోట్ల నెట్, రెండో రోజు రూ.1.16 కోట్ల నెట్, మూడో రోజు రూ.1.28 కోట్ల నెట్, నాలుగో రోజున రూ. 50 లక్షల నెట్, ఐదో రోజున రూ.40 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఐదు రోజుల వరకు తమ్ముడు మూవీ ఇండియాలో రూ.5.41 కోట్ల నెట్.. 6.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు కేవలం రూ.85 లక్షల కలెక్షన్స్ మాత్రమే అందుకోగలిగింది. తద్వారా తమ్ముడు సినిమా ఐదు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 7.60 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్జించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తమ్ముడుకి లాభమెంత? నష్టమెంత?
తమ్ముడు మూవీతో హిట్ కొట్టాలని అనుకున్న నితిన్ కలలు కల్లలయ్యాయి. బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ చిత్రం పాజిటివ్ రిజల్ట్ చూపించలేకపోయింది. కీలకమైన వీకెండ్‌లోనూ కనీసం 5 కోట్ల రూపాయలు సాధించడానికి నితిన్ ఆపసోపాలు పడ్డాడు. 25 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు గాను ఏ ఏరియాలోనూ తమ్ముడు మూవీ గట్టెక్కలేకపోయింది. 12 శాతం రికవరీతో 5 రోజుల వరకు కేవలం 3 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ మాత్రమే రాబట్టిన తమ్ముడు మూవీ ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 22 కోట్ల రూపాయలను మిగిల్చింది.
నిర్మాత దిల్‌రాజు దాదాపు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. కానీ తమ్ముడు బాక్సాఫీస్ రిజల్ట్‌తో బడ్జెట్ పరంగా ఆయనకు దాదాపు 70 కోట్ల వరకు నష్టం జరిగినట్లే. కాకపోతే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా దిల్‌రాజు ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో దిల్‌రాజు బ్యానర్ బ్రాండ్ వాల్యూకు మాత్రం డ్యామేజ్ జరిగినట్లే.


Click it and Unblock the Notifications











