Thammudu Box Office Day 3: డిజాస్టర్ దిశగా తమ్ముడు.. నితిన్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. 3వ రోజు ఎన్ని కోట్లంటే
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్రనేత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. సీనియర్ నటి లయ, సౌరబ్ సచ్‌దేవ, హరితేజ, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించగా.. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మూడో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? తమ్ముడు సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళితే..
తమ్ముడు బడ్జెట్ ఎంత?
నితిన్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా తమ్ముడు నిలిచింది. నిర్మాణ విలువలు, నేచురల్ ఎక్స్‌పీరియన్స్ కోసం నిర్మాత దిల్‌రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి తమ్ముడు చిత్రానికి 75 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యిందని స్వయంగా దిల్‌రాజు ప్రకటించారు.

తమ్ముడు బిజినెస్& బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
నితిన్ వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ.. దిల్‌రాజు నిర్మాత కావడంతో ఆయనపై నమ్మకంతో తమ్ముడు సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో 8.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఏపీలోని ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో తమ్ముడు సినిమాకు 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ 4 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. మొత్తంగా తమ్ముడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నితిన్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూకట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో కలిపి 1000 స్క్రీన్‌లలో తమ్ముడు సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశారు.
తమ్ముడు రెండ్రోజుల వసూళ్లు
మార్నింగ్ షో నుంచే డివైడ్ ట్యాక్ తెచ్చుకున్న నితిన్ బాక్సాఫీస్ వద్ద నత్తనడకన తన జర్నీని ప్రారంభించాడు. ఇండియాలో తొలి రోజు రూ.1.90 కోట్లు, రెండో రోజు రూ.1.16 కోట్లు రూపాయల చొప్పున రెండ్రోజుల్లో రూ.2.25 కోట్ల నెట్ .. రూ.3.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది తమ్ముడు చిత్రం. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో రూ.67 లక్షలు, సీడెడ్‌లో రూ.20 లక్షలు, ఆంధ్రాలో 88 లక్షల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో రూ.2.95 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా రెండ్రోజుల్లో నితిన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
తమ్ముడు మూడో రోజు కలెక్షన్స్
డివైడ్ టాక్ నేపథ్యంలో వీకెండ్ అయినప్పటికీ ఆదివారం తమ్ముడు బుకింగ్స్ ఏమాత్రం మెరుగవ్వలేదు. శనివారంతో పోల్చితే ఏకంగా 39 శాతం మేర బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 13.87 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 382 షోలు, బెంగళూరులో 207 షోలు, విజయవాడలో 74 షోలు, విశాఖలో 104 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. మూడో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల నెట్.. రూ.1.80 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో నితిన్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











