Thammudu Box Office Day 4: చాప చుట్టేసిన నితిన్ .. 4వ రోజు తమ్ముడు మూవీకి ఎన్ని కోట్లంటే?

వరుస ఫ్లాపులతో కెరీర్‌పరంగా ఇబ్బందులు పడుతున్న హీరో నితిన్‌ ఈసారి హిట్ కొట్టాలనే కసితో చేసిన మూవీ తమ్ముడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ తర్వాత వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తికలు హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ తమ్ముడు సినిమాను నిర్మించారు. సీనియర్ నటి లయ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వగా సౌరబ్ సచ్‌దేవ, హరితేజ, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాంతార సినిమాకు పనిచేసిన అజనీష్ లోక్‌నాథ్ వంటి టాలెంటెట్ టెక్నీషియన్ .. తమ్ముడు సినిమాకు మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు నాలుగో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళితే..

తమ్ముడు బడ్జెట్ ఎంత?
నితిన్ కోసం నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్ కేటాయించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఏది కావాలంటే దానిని క్షణాల్లో సమకూర్చిపెట్టారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా స్వయంగా నితిన్‌కు ఓ ఫన్నీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ్ముడు మూవీకి హైప్ రావడానికి ఈ ఇంటర్వ్యూ కొంతమేర ఉపయోగపడింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి తమ్ముడు చిత్రానికి 75 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

Thammudu Day 4 Box Office Collections Worldwide Nithiin s film Fails to Impress after weekend

తమ్ముడు బిజినెస్& బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
తమ్ముడు చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాంలో 8.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలోని ఇతర ప్రాంతాల హక్కులు 8.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మొత్తంగా ఆంధ్రా, నైజాంలలో తమ్ముడు సినిమాకు 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. మొత్తంగా నితిన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. తమ్ముడు సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 25 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూకట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 స్క్రీన్‌లలో తమ్ముడు సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశారు.

తమ్ముడు మూడు రోజుల వసూళ్లు
మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన తమ్ముడు సినిమాకు ఫస్ట్ డే నుంచే షాకింగ్ వసూళ్లు వస్తున్నాయి. నితిన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 62 లక్షల రూపాయలు, మూడో రోజున 51 లక్షల రూపాయల చొప్పున 2.26 కోట్ల రూపాయల నెట్.. 3.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాంలో 89 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 25 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 1.12 కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్స్ వచ్చాయి.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో మూడు రోజుల వరకు 75 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. వీటితో కలుపుకుని తమ్ముడు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయల నెట్.. 5.70 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

నాలుగో రోజు తమ్ముడు కలెక్షన్స్
డివైడ్ టాక్‌తో జర్నీ ప్రారంభించిన తమ్ముడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం కోలుకోలేదు. కనీసం వీకెండ్‌లోనూ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయారు నితిన్. రోజు రోజుకు బుకింగ్స్ కోల్పోతూ కనీసం 10 కోట్ల మార్క్ అయినా టచ్ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 4వ రోజు ఏకంగా 70 శాతానికి పైగా డ్రాప్స్ అందుకుంది. వర్కింగ్ డే అయిన సోమవారం తమ్ముడు మూవీకి 11.85 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 354 షోలు, బెంగళూరులో 170, విజయవాడలో 64, విశాఖలో 106 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి.

నాలుగో రోజు తమ్ముడు చిత్రానికి ఇండియాలో నికరంగా 50 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. వీటితో కలుపుకుని నాలుగు రోజుల వరకు నితిన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. పరిస్ధితి చూస్తుంటే తమ్ముడు సినిమా నితిన్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ్ముడు మూవీ నష్టాలను తప్పించుకోవాలంటే బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X