Thammudu Day 2 Collections: తమ్ముడు సినిమాపై భారీ దెబ్బ.. నితిన్ మూవీ దారుణంగా.. కలెక్ష్లన్లు ఎన్ని కోట్లంటే?
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? ఈ సినిమా నష్టాల నుంచి బయటపడాలంటే ఎంత వసూలు చేయాలనే వివరాల్లోకి వెళితే..
తమ్ముడు మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిసులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల రూపాయల మేర జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు 20 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్ల రూపాయల మేర జరిగింది.

నితిన్ తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఈ సినిమాను ఆంధ్రా, నైజాంలో కలిపి 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 25 కోట్ల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సిన అసవరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.
తమ్ముడు సినిమా తొలి ఆట తర్వాత బ్యాడ్ టాక్‌తో వసూళ్ల యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో 45 లక్షలు, సీడెడ్‌లో 15 లక్షలు, ఆంధ్రాలో 60 లక్షలు నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి 50 లక్షలు నెట్, కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో తొలి రోజు 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఈ సినిమాపై నెగిటివ్ టాక్ ప్రభావం భారీగా పడటంతో రెండో రోజు దాదాపు 50 శాతం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. దాంతో ఈ సినిమా దారుణంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు నమోదు చేశాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1 కొటి రూపాయల నెట్, 2 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా పరిస్థితి చూస్తే.. భారీ నష్టాల్లో ముగిసే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమాకు ఎలాంటి పాజిటివ్ సంకేతాలు కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది.


Click it and Unblock the Notifications











