Thandel Advance Booking : రిలీజ్‌కు ముందే నాగచైతన్య సంచలనం.. అడ్వాన్స్ బుకింగ్‌తో ఎన్ని కోట్లంటే?
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్యకు ఇప్పుడు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. మూడేళ్ల క్రితం బంగార్రాజు తర్వాత ఇప్పటి వరకు చైతూకి హిట్ లేదు. థ్యాంక్యూతో పాటు తన హిందీ డెబ్యూ లాల్ సింగ్ చద్దాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చైతన్య కెరీర్ డైలమాలో పడింది. తనకు బాగా అచ్చొచ్చిన ప్రేమ కథలు కాకుండా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడమే చైతూ కొంప ముంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కార్తీకేయ -2తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య చేసిన చిత్రమే తండేల్. సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా పాకిస్తాన్ బలగాలకు చిక్కడం, అక్కడి జైళ్లలో ఇబ్బందులు , తిరిగి విడుదల కావడం కోసం పడ్డ ఇబ్బందులే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ సినిమాను రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యథిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇదే. ఇందులో చైతూ సరసన లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. ప్రకాశ్ బెలవాడి, కరుణాకరన్, కల్పలత, పర్వతీశం, మహేశ్ అచంట తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
టీజర్, ట్రైలర్, పోస్టర్లతో భారీ హైప్ క్రియేట్ చేసిన తండేల్‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియాలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్ల చొప్పున మొత్తంగా తండేల్ ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల బిజినెస్ చేసినట్లు ఫిలింనగర్ వార్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇంత తక్కువ బిజినెస్ జరగడం షాకే.
కాకపోతే నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని అంటున్నారు. తండేల్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.40 కోట్లకు దక్కించుకుందట, అలాగే హిందీ రైట్స్ రూ.8 కోట్లు , ఆడియో రైట్స్ 7 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా నాన్ థియేట్రికల్ 65 కోట్లు + థియేట్రికల్ రూ.31 కోట్లతో దాదాపు రూ.100 కోట్ల బిజినెస్‌తో నిర్మాత ఒడ్డున పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉండగా .. ఫిబ్రవరి 7వ తేదీన విడుదలవుతున్న తండేల్‌కు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నాలుగు రోజుల ముందుగానే ప్రీమియర్స్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అమెరికాలో 128 సెంటర్లలో 252 షోలకు గాను 2579 టికెట్లు అమ్ముడవ్వగా 37,490 డాలర్లు .. కెనడాలో 12 సెంటర్లలో 14 షోలకు గాను 64 టికెట్స్ అమ్ముడై 1200 కెనడా డాలర్ల ముందస్తు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా భారత కరెన్సీలో 34 లక్షలకు పైనే తండేల్ ముందస్తు వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్‌కు మూడు రోజులు టైం ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











