Thandel Advance Booking: జోరుగా తండేల్ అడ్వాన్స్ బుకింగ్.. నాగచైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ఎన్ని కోట్లంటే?
యువ సామ్రాట్ నాగచైతన్య, టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్. టాలీవుడ్‌లో పాపులర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్రలో జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితాలను నేపథ్యంగా రూపొదిద్దుకొన్న చిత్రం తండేల్. కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఓ వ్యక్తి పొరపాటున సముద్రంలో పాకిస్థాన్ సరిహద్దు తీరాన్ని దాటి వెళ్లడంతో అతడిని బంధించి జైల్లో పెట్టారు. ఆ కథను సినిమాటిక్‌గా మలిచి తెరకెక్కించారు. బన్నీ వాసు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిర్మించబడింది.

ఇక తండేల్ సినిమా ప్రమోషన్స్‌కు పాటలకు భారీగా రెస్సాన్స్ లభించింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తండేల్ సినిమాకు అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ సినిమాను సుమారుగా 300 లొకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన 600 షోలను స్క్రీనింగ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 7 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఇప్పటి వరకు 100K డాలర్లు అంటే.. సుమారుగా 90 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక అమెరికాలో ప్రీమియర్స్ ముగిసే సమయానికి భారీగానే కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్ కలిపి ఈ సినిమా సుమారుగా 300K నుంచి 400K మధ్య వసూళ్లు రాబడుతుందని అంచనాకు వచ్చారు. టాక్ బాగుంటే ఈ నంబర్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఆంధ్రా, నైజాంలో కూడా తండేల్ సినిమాకు మంచి డిమాండ్ కనిపిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్‌కు ఊహించని రెస్సాన్స్ వస్తున్నది. తెలుగు, రాష్ట్రాలతోపాటు కన్నడ, హిందీ ప్రాంతాల్లో కలిపి ఇప్పటి వరకు 30 శాతం ఆక్యుపెన్సీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నమోదైంది. సుమారుగా 1000 పైగా షోలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 1 కోటి రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సంపాదించింది అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











