Thandel Closing Collections: తండేల్‌ క్లోజింగ్ కలెక్షన్లు.. సాయిపల్లవి మూవీకి ఎంత లాభం? ఎంత నష్టం?

పాకిస్థాన్ జైల్లో మగ్గిన ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది జాలర్ల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన ఫలితాన్ని సాధించింది. మత్స్యకారుల జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా కాకినాడ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నేటివిటితో రూపొందిన ఈ సినిమాలో యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలను మేలవించిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7వ తేదీన వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

తండేల్ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. అలాగే యధార్థ సంఘటనల ఆధారంతో రూపొందిన చిత్రం కావడంతో నెటివిటి మిస్ కాకుండా భారీగా సెట్స్ వేశారు. అలాగే టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ భారీగా చేశారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం భారీగా అయింది. అంతేకాకుండా రిచ్‌గా సినిమాను తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 75 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Thandel Closing Collections

ఇక తండేల్ సినిమా ప్రమోషనల్స్ ఈవెంట్స్‌ వర్కవుట్ కావడం, సాయిపల్లవి, నాగచైతన్య కాంబినేషన్ క్రేజీగా మారడంతో మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Take a Poll

తండేల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. హిందీ రైట్స్ 2 కోట్ల మేర వాల్యూ కట్టారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Thandel Closing Collections

తండేల్ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా రెస్పాన్స్ రావడంతో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

తండేల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ సానుకూలంగా సాధించింది. ఈ సినిమా టోటల్ థియేట్రికల్ రన్‌ విషయానికి వస్తే.. నైజాంలో 20 కోట్ల రూపాయల నికరంగా వసూళ్లను సాధించింది. ఆంధ్రాలో 24 కోట్ల నికర కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఏపీ, నైజాంలో కలిపి 44 కోట్లు నెట్, 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

Thandel Closing Collections

ఇక తెలుగేతర ప్రాంతాల బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఈ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 11 కోట్లు నికరంగా 22 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 102 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. నాగచైతన్యకు తొలి వంద కోట్ల మూవీగా మారింది.

తండేల్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్ల షేర్, 92 కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌తో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా క్లోజింగ్ వరకు 102 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో 10 కోట్ల రూపాయల గ్రాస్ మేర ప్రాఫిట్ సాధించింది. ఇంకా శాటిలైట్, డిజిటల్ బిజినెస్ అదనపు లాభంగా గీతా ఆర్ట్స్ చేకూరినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X