Thandel Day 1 Collections: షాకింగ్‌గా తండేల్ కలెక్షన్లు.. సాయిపల్లవి, చైతూ మూవీకి ఎన్ని కోట్లంటే?
యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమాకు యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7వ తేదీన వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్ కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. దాంతో ఈ సినిమాకు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. హిందీ రైట్స్ 10 కోట్ల మేర వాల్యూ కట్టారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తండేల్ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా రెస్పాన్స్ రావడంతో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

తండేల్ సినిమాకు తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు ఏపీ, నైజాంలో కలిపి 60 శాతం ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయింది. వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాలో ఎక్కువగా ఆక్యుపెన్సీ కనిపించింది. ఈవెనింగ్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాకు వచ్చారు.
ఇదిలా ఉండగా, తండేల్ మూవీకి బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన పరిస్థితే కనిపించింది. ఈ సినిమా ఏపీ, నైజాంలో కనీసం 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు. ఇక ఓవర్సీస్‌లో 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా సుమారుగా తొలి రోజు 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











