Thandel Day 4 Collections: 100 కోట్ల క్లబ్‌కు చేరువగా తండేల్.. 4వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన సంఘటన, వారు పాకిస్థాన్ జైలులో 14 నెలలపాటు మగ్గిన ఉదంతాన్ని కథగా మలిచి తెరకెక్కించిన ఉద్వేగ భరిత ప్రేమకథా చిత్రం తండేల్. ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా వసూల చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తండేల్ మూవీ కథ సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. దాంతో ఈ సినిమాకు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ పాటలు రిలీజ్‌కు పెద్ద హిట్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం బిజినెస్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ స్వయంగా రిలీజ్ చేశారు.

తండేల్ సినిమా ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. హిందీ రైట్స్ 10 కోట్ల మేర వాల్యూ కట్టారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 39 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా 40 కోట్ల షేర్, 80 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి వచ్చింది.

తండేల్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఏపీ, నైజాంలో ఈ సినిమా తొలి రోజు 12 కోట్లు, రెండో రోజు 12 కోట్లు, మూడో రోజు 12 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక మూడు రోజుల్లో కర్ణాటకలో 3.5 కోట్లు, కేరళలో 10 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 48 కోట్ల నికర వసూళ్లను, 62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక అన్ని సినిమాలకు అగ్ని పరీక్షగా మారే సోమవారం తండేల్ సినిమా నిలకడగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు, రాష్ట్రాలు, కన్నడలో కలిపి సుమారుగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్‌తో కలిపి ఈ సినిమా 7 నుంచి 8 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశాలు లేకపోలేదన్నారు.


Click it and Unblock the Notifications











