Thandel Business: తండేల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. సాయిపల్లవి, చైతూ మూవీ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

యువ సామ్రాట్ నాగచైతన్య, టాప్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్.. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే..

తండేల్ మూవీకి సంబంధించిన పాటలు, ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేశాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్.. ముఖ్యంగా బుజ్జితల్లి, హైలెస్సా పాటలకు రికార్డు వ్యూస్ సాధించాయి. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు విశేషంగా ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించే చిత్రంగా ఓ రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాకు వేస్తున్నాయి.

Thandel Pre Release business Worldwide Sai Pallavi s Movie Break Even Target details

ఉత్తరాంధ్రలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన తండేల్ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా బన్నీ వాసు తెరకెక్కించారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో భారీగా తారాగణం, అలాగే ప్రతిభావంతులైన టెక్నిషియన్స్‌తో సినిమాను అందంగా తీర్చి దిద్దారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ ఏపీ, నైజాం, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బిజినెస్‌కు తగినట్టుగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది.

ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్‌కు భారీ రేటు పలికింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

Thandel Pre Release business Worldwide Sai Pallavi s Movie Break Even Target details

ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు కూడా భారీ రేటు పలికింది. ఈ రైట్స్ సుమారుగా 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. హిందీ రైట్స్ 10 కోట్ల మేర వాల్యూ కట్టారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ఈ చిత్రం 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X