Thangalaan Collections: విక్రమ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు.. తంగలాన్‌కు ఎన్ని కోట్లంటే?
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. ఈ చిత్రానికి సామాజిక స్పృహ కలిగిన డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటించారు. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
తంగలాన్ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో కొనసాగుతుంది. బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్‌తో రూపొందించారు. విక్రమ్ యాక్టింగ్‌కు భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి.

విక్రమ్‌తోపాటు పేరు ఉన్న నటీనటులు. పా రంజిత్, ఇతర సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లే భారీగా అయ్యాయి. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అనే ఫీలింగ్ కల్పించింది. కాకపోతే జీవీ ప్రకాశ్ లాంటి సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలే ఈ సినిమాను భారీ బడ్జెట్‌గా మార్చింది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తంగలాన్ సినిమా టీజర్లు, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ క్రేజీగా బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ భారీగా జరిగింది. తమిళనాడులో 48 కోట్ల రూపాయలు, ఏపీలో 6 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3 కోట్లు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 1.5 కోట్లు మేర జరిగింది. దాంతో ఈ సినిమా సుమారుగా 65 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసుకొన్నది.

విక్రమ్ కెరీర్‌లో 61వ చిత్రం కావడంతో ఈ మూవీపై స్పెషల్ అటెన్షన్ పెరిగింది. ఈ చిత్రానికి ఉన్న అంచనాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది. తమిళనాడు, ఏపీ, నైజాంలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది.
ఇక ఈ సినిమా తోలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. తమిళంలో విక్రమ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. తమిళంలో 11 కోట్లు నికరంగా 15 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగులో 1.5 కోట్లు నికరంగా, 3 కోట్ల గ్రాస్, మలయాళంలో 20 లక్షలు నికరంగా 50 లక్షల గ్రాస్, కన్నడలో 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు తంగలాన్ చిత్రం నిలకడగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం తమిళనాడులో భారీ వసూళ్లను సాదిస్తున్నది. 2వ రోజున ఈ సినిమా తమిళంలో 3.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 70 లక్షలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 7.5 కోట్ల మేర వసూళ్లను సాధించింది.
3వ రోజు తంగలాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం రెండో రోజు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించింది. తమిళంలో 5.2 కోట్ల రూపాయలు, తెలుగులో 70 లక్షల రూపాయలు, మలయాళంలో 40 లక్షలు, కన్నడలో 60 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 7 కోట్లు నికరంగా 10 కోట్లు గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
ఇక 3 రోజుల్లో తంగలాన్ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో మొత్తంగా 22 కోట్లు, ఆంధ్రా, నైజాంలో కలిపి 4 కోట్లు గ్రాస్, కేరళలో 1.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 9 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతోఈ చిత్రం 42 కోట్ల మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఈ చిత్రం 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











