Thangalaan Day 2 Collections: తంగలాన్ కలెక్షన్ల జోరు.. విక్రమ్ కెరీర్‌లో రికార్డు వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?
చియాన్ విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం తంగలాన్. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో . పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా ఇతర పాత్రల్లో పశుపతి తదితరులు నటించారు. ఆగస్టు 15వ తేదీన రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల రెస్సాన్స్‌ను కూడగట్టుకొని స్టడీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తంగలాన్ చిత్రం కథ, బడ్డెట్ విషయానికి వస్తే.. ఈ స్టోరి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో కొనసాగుతుంది. బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్‌తో రూపొందించారు. విక్రమ్ యాక్టింగ్‌కు భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి.

టాప్ యాక్టర్లు, పా రంజిత్, ఇతర సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లే భారీగా అయ్యాయి. కాకపోతే జీవీ ప్రకాశ్ లాంటి సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలే ఈ సినిమాను భారీ బడ్జెట్‌గా మార్చింది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తంగలాన్ తొలి రోజు తమిళనాడులో 12.5 కోట్లు, ఆంధ్రా, నైజాంలో 2.2 కోట్లు, కర్ణాటకలో 1.3 కోట్లు, ఓవర్సీస్‌లో 3.5 కోట్ల వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 20 కోట్ల షేర్, 26.44 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రెండో రోజు తంగలాన్ చిత్రం నిలకడగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం తమిళనాడులో భారీ వసూళ్లను సాదిస్తున్నది. 2వ రోజున ఈ సినిమా తమిళంలో 3.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 70 లక్షలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 7.5 కోట్ల మేర వసూళ్లను సాధించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా గత రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 26.44 కోట్లు, రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 34 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











