Thangalaan Day 3 Collections: 50 కోట్లకు చేరువగా తంగలాన్.. 3వ రోజు విక్రమ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కెరీర్‌లో 61వ చిత్రంగా రూపొందిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. సామాజిక స్పృహతో కూడిన దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడగట్టుకొంటున్నది. ఈ చిత్రం 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
చరిత్రలో 5వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్‌తో రూపొందించారు. ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తంగలాన్ చిత్రం కోట్ల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ చిత్రం ఇండియాలో తొలి రోజు 13.3 కలెక్షన్లను, వరల్డ్ వైడ్‌గా 26.4 కోట్లు వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 4.75 కోట్ల నికరంగా వరల్డ్ వైడ్‌గా 8.75 కోట్లు రాబట్టింది. దాంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా 35 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక ఇండియాలో తమిళ వెర్షన్ తంగలాన్‌కు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు తమిళంలో 12 కోట్ల రూపాయలు, 2వ రోజు 4 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక తెలుగులో ఈ చిత్రం తొలి రోజు 1.5 కోట్ల నికరంగా రెండో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. మలయాళంలో ఈ చిత్రం తొలి రోజు 50 లక్షలు, రెండో రోజు 40 లక్షలు రాబట్టింది.

ఇక 3వ రోజు తంగలాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం రెండో రోజు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించింది. తమిళంలో 5.2 కోట్ల రూపాయలు, తెలుగులో 70 లక్షల రూపాయలు, మలయాళంలో 40 లక్షలు, కన్నడలో 60 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 7 కోట్లు నికరంగా 10 కోట్లు గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
ఇక 3 రోజుల్లో తంగలాన్ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో మొత్తంగా 22 కోట్లు, ఆంధ్రా, నైజాంలో కలిపి 4 కోట్లు గ్రాస్, కేరళలో 1.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 9 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతోఈ చిత్రం 42 కోట్ల మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఈ చిత్రం 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











