Thangalaan Day 4 Collections: తంగలాన్ 4వ రోజు కలెక్షన్లు.. విక్రమ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్, చియాన్ విక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం తంగలాన్. దక్షినాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం గత 4 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..
భారతీయ చరిత్రలో 5వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్‌తో రూపొందించారు. ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు.

గత మూడు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తమిళనాడులో సుమారుగా 20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ఈ చిత్రం 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 3 రోజుల్లో సుమారుగా 28 కోట్ల నికర కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
తమిళనాడులోని 4వ రోజు పలు ప్రాంతాల్లో విక్రమ్ మూవీకి భారీ స్పందన కనిపించింది. చెన్నై, కోయబత్తూరు, పాండిచ్చేరి, సాలెం, వెల్లూరు, త్రిచీ, ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 60 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 45 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నది.

ఇక 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు, మలయాళంలో 50 లక్షలు, కన్నడలో 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 7.2 కోట్లు నికరంగా.. 9 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
గత 4 రోజుల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఈ చిత్రం 25 కోట్ల నికరంగా, తెలుగులో 5 కోట్ల రూపాయలు, కన్నడలో 3 కోట్ల రూపాయలు, కేరళలో 2.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో సుమారుగా 10 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 50 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











