Thangalaan Day 5 Collections: భారీగా క్షీణించిన తంగలాన్ కలెక్షన్లు.. విక్రమ్ మూవీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే?

విక్రమ్ కెరీర్‌లో 61వ చిత్రంగా రూపొందిన తంగలాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. తొలి వారాంతం భారీగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తొలి సోమవారం రోజున కలెక్షన్లు భారీగా క్షీణించాయి. దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు కురిపించినా.. థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించడంలో విఫలవుతున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్‌తో రూపొందించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు.

Thangalaan Day 5 Box Office Collections Worldwide Vikram movie dropped heavily on Monday

ఇండియాలో తంగలాన్ సినిమా తొలి రోజు భారీగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా 13.3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, 3వ రోజు 6 కోట్ల రూపాయలు, 4వ రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా గత 4 రోజుల్లో 30 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక బాక్సాఫీస్‌కు అగ్ని పరీక్షగా సోమవారం పూర్తిగా ఈ సినిమా చతికిలపడింది. ఈ సినిమా అక్యుపెన్సీ చాలా తక్కువగా నమోదైంది. వర్షాలు, రాఖీ పండగ వాతావరణం ఓ కారణమైతే.. దేశవ్యాప్తంగా స్త్రీ 2 సినిమా సాధిస్తున్న కలెక్షన్లు మరో కారణం అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం రోజున 35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది.

Thangalaan Day 5 Box Office Collections Worldwide Vikram movie dropped heavily on Monday

తంగలాన్ 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 2.6 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలు చేసింది. తమిళంలో 1.5 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షలు, కన్నడలో 35 లక్షలు, మలయాళంలో 25 లక్షలు వసూలుచేసింది. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో 32.6 కోట్లు వసూలు చేసింది.

ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తంగలాన్ చిత్రం నార్త్ అమెరికా అంటే.. యూఎస్, కెనడాలోను, అలాగే గల్ప్, సింగపూర్, మలేషియాలో భారీగానే వసూళ్లు సాధించింది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 13 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం గత 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ సినిమా భారీ నష్టాలతో ముగిసే ప్రమాదం కనిపిస్తున్నది.

More from Filmibeat

Read more about: thangalaan vikram box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X