Thangalaan Day 6 Collections: బాక్సాఫీస్‌ను నిరాశపరిచిన తంగలాన్.. విక్రమ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
తమిళ సూపర్ స్టార్, చియాన్ విక్రమ్ ప్రత్యేకంగా నిలిచిన తంగలాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందనే చెప్పాలి. సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆరంభంలో భారీ కలెక్షన్లు సాధించినా.. తొలి వారాంతం తర్వాత ఈ మూవీ సత్తా చాటలేకపోతున్నది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం గత 6 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్‌తో రూపొందించారు. ప్రముఖ సినీ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. దాదాపు ఈ సినిమా 80 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

తంగలాన్ సినిమాపై భారీ క్రేజ్ ఉండటం, దానికి తగినట్టే ట్రైలర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావడం.. విక్రమ్ చేసిన ప్రమోషన్స్‌కు మంచి స్పందన రావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 13.5 కోట్ల రూపాయలు ఇండియాలోనే వసూలు చేసింది. 2వ రోజు 5 కోట్లు, 3వ రోజు 5.5 కోట్లు, 4వ రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారాంతంలో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది.
అయితే తొలివారాంతం తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. ఈ చిత్రం 5వ రోజు 2.5 కోట్లు నికరంగా, 6వ రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 1.25 కోట్లు, తెలుగులో 40 లక్షలు, ఇతర భాషల్లో 35 లక్షల రూపాయలు రాబట్టింది.

గత 6 రోజుల్లో ఈ చిత్రం రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, తెలుగులో 7.5 కోట్ల రూపాయల గ్రాస్, కన్నడలో 5.5 కోట్ల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 15.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 66 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. సుమారుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











