Thank You movie day 1 collections.. బాక్సాఫీస్ వద్ద దిల్ రాజు పరిస్థితి ఏమిటి?
యువ సామ్రాట్ నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం థ్యాంక్యూ. రిలీజ్‌కు ముందు విడుదలైన సినిమా టీజర్లు, ట్రైలర్లు అంచనాలను భారీగా పెంచాయి. ఫీల్‌గుడ్ చిత్రంగా టాక్ సంపాదించుకొన్న ఈ చిత్రానికి రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతమైంది. ఈ క్రమంలో తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో థ్యాంక్యూ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
థ్యాంక్యూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 8 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 9.5 కోట్లుతో మొత్తంగా ఆంధ్రా, తెలంగాణలో 20 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 1.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ బిజినెస్ 2.5 కోట్లుగా నమోదు చేసింది. దాంతో మొత్తంగా ఈ సినిమా బిజినెస్‌ను 24 కోట్లుగా అంచనా కట్టారు.

టికెట్ రేట్ల తగ్గింపుతో
థ్యాంక్యూ సినిమా రిలీజ్‌కు ముందు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్, వరద పరిస్థితులు తీవ్రంగా మారాయి. జూలై 22న తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపని వర్షాలు కురిశాయి. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా రెస్సాన్ రాలేకపోయింది. టికెట్లు రేట్లు 150, 100 రూపాయలకు తగ్గించినా తుఫాన్ పరిస్థితులు మరింత దెబ్బ తీశాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.

అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఏమిటంటే?
ఇక హైదరాబాద్‌లో తుఫాన్ పరిస్థితుల్లో కూడా థ్యాంక్యూ తొలి రోజు అడ్వాన్సు బుకింగ్‌కు ఓ మోస్తారు స్పందన కనిపించింది. 348 షోల ద్వారా ఈ చిత్రం 20 శాతానికి పైగా అక్యుపెన్సీతో 63 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు నైజాంలో 1 కోటికిపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

అమెరికాలో ప్రీమియర్లకు
అమెరికాలో జూలై 21వ తేదీ రాత్రి వేసిన ప్రీమియర్లకు పెద్దగా స్పందన లభించలేదు. అమెరికా వ్యాప్తంగా 197 లోకేషన్లలో 411 షోలు వేస్తే ఈ సినిమా 40k అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. తొలి రోజు కలెక్షన్లు మరో 40k రాబట్టవచ్చనే రిపోర్టు ట్రేడ్ వర్గాల నుంచి ఉంది.

తొలి రోజు ఎంత వసూలు చేయవచ్చంటే?
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ముగిసే సమయానికి థ్యాంక్యూ చిత్రం 2.7 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని అంచనావేశారు. ఒకవేళ ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టగలిగితే.. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్నట్టే అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











