The Challenge రష్యా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న అంతరిక్షంలో తొలి సినిమా.. 4 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

అంతరిక్షంలో షూట్ చేసి రూపొందించిన తొలి చిత్రం ది ఛాలెంజ్ రష్యన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 12 రోజుల పాటు చిత్రీకరించిన ఈ చిత్రాన్ని రష్యాలోని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు, నటీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు ఈ సినిమా గురించి, సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ది ఛాలెంజ్ బడ్జెట్: ది ఛాలెంజ్ సినిమా విషయానికి వస్తే.. రష్యా సినిమా పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా పేరున్న 38 ఏల్ల యూలియా పెరెసిల్ద్ నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన క్లిమ్ షిపెంకో, కెమెరా, లైటింగ్, సౌండ్ విభాగాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సినిమాను నిర్మించడానికి 905 మిలియన్ రూబుల్స్ (12 మిలియన్ అమెరికన్ డాలర్లు) అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు 100 కోట్ల రూపాయలు అయింది.

 The Challenge

ది ఛాలెంజ్ కథ ఏమిటంటే? : ది ఛాలెంజ్ సినిమా విషయానికి వస్తే.. అంతరిక్షంలో గాయపడిన వ్యోమగామికి అత్యవసర చికిత్సను అందించాల్సి వస్తుంది. అతడి ప్రాణాలను కాపాడటానికి థోరియాసిస్ సర్జన్‌ను అంతరిక్షంలోకి పంపిస్తారు. అంతరిక్షంలోకి వెళ్లిన సర్జన్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? వ్యోమగామి ప్రాణాలు కాపాడిందా? అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకు క్లిమ్ షిపెంకో దర్శకత్వం వహించారు.

లేటేస్ట్ టెక్నాలజీతో : ది ఛాలెంజ్ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. ఈ సినిమా కోసం అంతరిక్ష శాస్త్రజులతో ఐమాక్స్, టైమ్ స్టూడియోస్, ఫెలిక్స్ అండ్ పాల్ స్టూడియోస్ పనిచేశాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని పరిస్థితులను లార్జ్ ఫార్మాట్, 3డీ, 360 డిగ్రీల డాక్యుమెంటరీ ఫార్మాట్‌లో రూపొందించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ప్రయత్నించారు.

 The Challenge

కాస్మోనాటిక్స్ డే రోజున ప్రీమియర్స్ : ది ఛాలెంజ్ సినిమాను సోవియట్ కాస్మోనాట్ యూరీ గాగరిన్ 62వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కాస్మోనాటిక్స్ డే (ఏప్రిల్ 12) రోజున స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఈ ప్రీమియర్‌కు చిత్ర యూనిట్, దర్శకుడు, నటి తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా ప్రదర్శన తర్వాత చిత్ర యూనిట్ ప్రతిభపై సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పోస్టల్ స్టాంప్ విడుదల : అంతరిక్షంలో తెరకెక్కించిన తొలి చిత్రంగా ది ఛాలెంజ్ అరుదైన ఘనతను సాధించిన సందర్భాన్ని రష్యా ఘనంగా వేడుకలను జరుపుకొన్నది. మోడరన్ రష్యన్ సినిమాటోగ్రఫి పేరుతో 30 రూబుల్ విలువైన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ కార్యక్రమం మాస్కో, స్టార్ సిటీ, కోరోలెవ్, బైకనూర్, పెర్మ్, చెల్యబిన్‌స్క్‌లో విడుదల చేశారు.

 The Challenge

నాలుగు రోజుల్లో వసూళ్లు ఎంతంటే? : ది ఛాలెంజ్ సినిమాను ఏప్రిల్ 20 తేదీ నుంచి పలు ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఈ సినిమాను 14 లక్షల మంది వీక్షించారు. దాంతో ఈ సినిమా 445 మిలియన్ రూబుల్స్ అంటే 5.5 మిలియన్ యూఎస్ డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో దాదాపు 45 లక్షలు రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X