The Devil Day 1 Collections: ది డెవిల్‌కు రికార్డ్ ఓపెనింగ్స్... దర్శన్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

తన వీరాభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ది డెవిల్. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు దర్శన్ క్రేజ్‌ను మరోసారి చాటి చెప్పాయి. ఈ నేపథ్యంలో ది డెవిల్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

ది డెవిల్ తారాగణం
వైష్ణో స్టూడియోస్, జై మాతా కంబైన్స బ్యానర్‌లపై ప్రకాష్, జే జయమ్మలు సంయుక్తంగా ది డెవిల్ సినిమాను నిర్మించగా ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దర్శన్ సరసన రచన రాయ్ హీరోయిన్‌గా నటించారు. మహేశ్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మండ్రే, రోజర్ నారాయణ్, శోభరాజ్, శ్రీనివాస్ ప్రభు, తులసి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కాంతార వంటి బ్లాక్ బస్టర్ మూవీకి సంగీతం అందించిన అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. సుధాకర్ ఎస్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లగా గతేడాది రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ జైలుకు వెళ్లడంతో ది డెవిల్ షూటింగ్ ఆలస్యమైంది.

The Devil Day 1 expected Box Office Collections Worldwide Darshan Thoogudeepa s Movie good start at GBOC

ది డెవిల్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఈ సినిమాకు 55 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా శాండల్‌వుడ్ వర్గాలు తెలిపాయి. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. భారీ అంచనాల నేపథ్యంలో ది డెవిల్‌ నిర్మాణం విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కన్నడ వర్గాల సమాచారం ప్రకారం ది డెవిల్‌కు వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 32 కోట్ల రూపాయల షేర్, 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ది డెవిల్ కలెక్షన్స్
దర్శన్ క్రేజ్‌, భారీ అంచనాల నేపథ్యంలో ది డెవిల్‌ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపింది. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫాంలలో ది డెవిల్‌కు 2.73 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కర్ణాటక వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో తెల్లవారుజామునే 150 వరకు స్పెషల్ షోలు పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మీద ప్రీ సేల్స్ పరంగా ది డెవిల్ మూవీకి 7.68 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దర్శన్ మూవీకి తొలిరోజు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 57 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు బెంగళూరులో 899 షోలు, మైసూరులో 98 షోలు, మంగళూరులో 49 షోలు, కాలబురగిలో 47 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు నివేదించింది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్‌ను బట్టి ది డెవిల్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 20 నుంచి 25 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X