3 రోజుల్లో 1700 కోట్ల కలెక్షన్లు.. 2026లో టాప్ లేపిన ది డెవిల్ వియర్స్ ప్రాడా 2

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ది డెవిల్ వియర్స్ ప్రాడా చిత్రం రిలీజై భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం 2026 సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2006 సంవత్సరంలో రిలీజైన ది డెవిల్ వియర్స్ ప్రాడా సినిమాకు 20 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా ది డెవిల్ వియర్స్ ప్రాడా 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నటించిన ఆర్టిస్టులు ఎవరు? పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎవరు? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ది డెవిల్ వియర్స్ ప్రాడా 2 సినిమా విషయానికి వస్తే.. మెరిల్ స్ట్రిప్, అన్నె హ్యాత్వే, ఎమిలీ హంట్, జస్టిన్ థిరాక్స్, కెన్నెత్ బ్రనాగ్, స్టాన్లీ టుసీ నటించారు. సినిమాటోగ్రఫి: ఫ్లోరియన్ బాలిహాస్, ఎడిటింగ్: ఆండ్రూ మెర్కస్, మ్యూజిక్: థియేడర్ షాపిరో తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. వెండీ ఫైన్‌మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ అయింది.

The Devil Wears Prada 2 Box Office Report

మీడియా, ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్‌తో కామెడీగా డ్రామాగా రూపొందిన ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు. టాప్ స్టార్స్, ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 100 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 950 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను అంతే మొత్తంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో మూవీ బాక్సాఫీస్‌ను పెద్దగా ప్రభావితం చేయలేకపోయిందనే విషయం తాజా గణాంకాలతో స్పష్టమవుతున్నది. ఈ సినిమాను 24 రాష్ట్రాల్లో 100కు పైగా పట్టణాల్లో 420 లోకేషన్లలో, 500 కుపైగా స్క్రీన్లలో ప్రదర్శనకు భారీగా ఏర్పాటు చేశారు. ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు ఈ చిత్రం 5 కోట్ల రూపాయలు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు ఈ సినిమా తాజా సమాచారం అందేసరికి 3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి మూడు రోజుల్లో 15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది డెవిల్ వియర్స్ ప్రాడా 2 మూవీకి ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఆదరణ లభిస్తున్నది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, స్పెయిన్, కొరియా, ఫ్రాన్స్, మెక్సికో, బ్రెజిల్, ఇటలీ దేశాల్లో రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నది అని ట్రేడ్ అనలిస్టులు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

ఈ చిత్రానికి అమెరికా, కెనడాలో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. గత మూడు రోజుల్లో ఈ సినిమా 80 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 760 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికేతర ప్రాంతాల్లో ఈ చిత్రం 100 మిలియన్ డాలర్లు 950 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2026 సంవత్సరంలో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Read more about: meryl streep box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X