1250 కోట్ల బడ్జెట్.. ఇండియాలో డిజాస్టర్.. వరల్డ్ వైడ్ ఎన్ని వందల కోట్ల కలెక్షన్లంటే?
అమెరికన్ యాక్షన్ కామెడీ చిత్రం ది ఫాల్ గయ్ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. డేవిడ్ లీచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ర్యాన్ గోస్లింగ్, గయ్‌మన్ కేసాడీ నిర్మించారు. ఎమిలి బ్లంట్, ఆరోన్ టైలర్, హన్నా, తెరెసా, స్టెఫానీ హు, విన్‌స్టన్ డ్యూక్ తదితరులు నటించారు. మే 12వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ది ఫాల్ గయ్ చిత్రం కథ విషయానికి వస్తే.. కోల్ట్ సీవర్స్ అనే వ్యక్తి హాలీవుడ్‌లో స్టంట్ మాస్టర్. సూపర్ స్టార్ టామ్ రైడర్‌కు బాడీ డబుల్‌గా వర్క్ చేస్తుంటాడు. ఓ యాక్షన్ స్టంట్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి తన కెరీర్‌కు, ప్రియురాలికి దూరం అవుతాడు. ఆ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.

యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ స్టోరీని ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. ర్యాన్ గోస్లింగ్ స్వయంగా నిర్మాతగానే కాకుండా హీరోగా కూడా ఈ సినిమాలో కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమాను సుమాుగా 150 మిలియన్ల డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1250 కోట్ల రూపాయలతో రూపొందించారు.
ఇక ఇండియాలో ది ఫాల్ గయ్ అనే సినిమాకు అంతంగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు పెద్దగా స్పందించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇండియాలో ఈ చిత్రం నికరంగా 5.5 కోట్ల రూపాయలు, 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లో అంటే.. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఓ రకమైన కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 310 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికాలో అంటే యూఎస్, కెనడాలో కలిపి ఈ చిత్రం 240 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత 14 రోజుల్లో 560 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











