The Family Star Collections విజయ్ దేవరకొండకు రికార్డు కలెక్షన్లు.. ఫ్యామిలీ స్టార్‌కు ఎన్ని కోట్ల వసూళ్లు!

తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించారు. మృణాల్ థాకూర్, జగపతి బాబు, రొహిణి హట్టంగడి, వెన్నెల కిషోర్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ది ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే.. ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో కొంత భాగం అమెరికాలో చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్లు కూడా నటించడంతో రెమ్యునరేషన్స్ భారీగానే నమోదు అయ్యాయి. అయితే రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కంటెంట్‌తో కలిపి మొత్తంగా ఈ సినిమాను 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.

The Family Star day 1 Expected Collections Worldwide Vijay Deverakonda Movie good Start at GBOC

ఇక ఫ్యామిలీ స్టార్ ట్రైలర్స్ సినిమా రిలీజ్‌‌కు ముందు బజ్ క్రియేట్ చేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాంలో 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్, సీడెడ్‌లో 5 కోట్ల మేర బిజినెస్, ఆంధ్రాలో 17 కోట్ల బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జ రిగింది. ఈ చిత్రం కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల మేర, ఓవర్సీస్‌లో 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 47 కోట్ల మేర కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది.

The Family Star day 1 Expected Collections Worldwide Vijay Deverakonda Movie good Start at GBOC

మృణాల్ థాకూర్ నటించిన ఈ మూవీకి రెస్పాన్స్ ఎక్కువగా ఉండటంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రాలో సుమారుగా 900 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 700 స్క్రీన్లతో కలిపి వరల్డ్ వైడ్ 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధికంగా రిలీజైన చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది.

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ యావరేజ్‌గా జరిగింది. ఈ సినిమా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. ఇక ఆంధ్రా, నైజాంలో ఈ చిత్రం 5 కోట్ల గ్రాస్ వసూళ్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా 200K, తొలి రోజు 300K అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 9 నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

The Family Star day 1 Expected Collections Worldwide Vijay Deverakonda Movie good Start at GBOC

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X