The Flash Collections ది ఫ్లాష్ కలెక్షన్ల జైత్రయాత్ర.. ఆదిపురుష్ పోటీ తట్టుకొని.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, డబుల్ డ్రీమ్స్, ది డిస్కో ఫ్యాక్టరీ బ్యానర్లపై ఆండీ ముస్చిట్టి దర్శకత్వంలో బార్బారా ముచ్చిట్టి, మైఖేల్ఓ డిస్కో నిర్మించిన చిత్రం ది ఫ్లాష్. సూపర్ హీరో చిత్రంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ది ఫ్లాష్ చిత్రం తొలి రోజున ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యధిక బడ్జెట్‌తో చిత్రాల్లో ది ఫ్లాష్ సినిమా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను సుమారు 220 మిలియన్ డాలర్లతో అంటే భారతీయ కరెన్సీలో 1809 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. జూన్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఇండియాలో దాదాపు 1800 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో వివిధ భాషలకు సంబంధించి తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ 2.95 కోట్లు, హిందీలో ఒక కోటి రూపాయలు, తెలుగులో 20 లక్షల రూపాయలు, తమిళంలో 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజున 5.2 కోట్ల గ్రాస్ 4.3 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది.
భారీ అంచనాలతో వచ్చిన ది ఫ్లాస్ చిత్రం ఆదిపురుష్ సినిమా పోటీని తట్టుకొని మంచి ఆక్యుపెన్సీనిని నమోదు చేసింది. ది ఫ్లాష్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ మార్నింగ్ షోకు 40 శాతం, మధ్యాహ్నం షోకు 26 శాతం, ఫస్ట్ షోకు 35 శాతం, సెకండ్‌షోకు 50 శాతం వసూళ్లను సాధించింది.
ఇక ది ఫ్లాష్ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాపై ఆదిపురుష్ దెబ్బ గట్టిగానే పడినట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రం రెండో రోజున 2.5 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ చిత్రం సుమారు 6.8 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.
ది ఫ్లాష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తొలి వారాంతంలో అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం 160 మిలియన్ డాలర్లు అంటే 1300 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











