The Flash Collections 2000 కోట్ల కలెక్షన్లకు చేరువగా ది ఫ్లాష్.. ఇండియాలో హిట్టా? ఫట్టా?
హాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, డబుల్ డ్రీమ్స్, ది డిస్కో ఫ్యాక్టరీ బ్యానర్లపై ఆండీ ముస్చిట్టి దర్శకత్వంలో బార్బారా ముచ్చిట్టి, మైఖేల్ఓ డిస్కో నిర్మించిన చిత్రం ది ఫ్లాష్. సూపర్ హీరో చిత్రంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. హాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యధిక బడ్జెట్‌తో చిత్రాల్లో ది ఫ్లాష్ సినిమా ఒకటిగా చెప్పుకోవచ్చు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తొలివారంలో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
ది ఫ్లాష్ సినిమా సుమారు 220 మిలియన్ డాలర్లతో అంటే భారతీయ కరెన్సీలో 1800 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఇండియాలో దాదాపు 1800 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 6000 థియేటర్లలో విడుదల చేశారు.

ఇండియాలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ది ఫ్లాష్ చిత్రం తొలి రోజు 4.3 కోట్ల వసూళ్లను, రెండో రోజు 3.4 కోట్లు, మూడో రోజు 4.5 కోట్ల వసూళ్లు, నాలుగో రోజు 5 కోట్ల వసూళ్లు, ఐదో రోజు 1.5 కోట్లు, ఆరో రోజు 1.25 కోట్లు, 7వ రోజు 1.2 కోట్లు, ఎనిమిదో రోజు 1 కోటి రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.
ఇక ది ఫ్లాష్ చిత్రం 2023 సంవత్సరంలో హాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఫాస్ట్ ఎక్స్, యాంట్ మ్యాన్, వాస్ప్ క్వాంటుమానియా, గార్డియన్ ఆఫ్ గెలాక్సీ 3, జాన్ విక్ 4, షాజమ్ 2 చిత్రాల కంటే ఎక్కువగా వసూళ్లను సాధించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ది ఫ్లాష్ చిత్రం ఇండియాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇండియాలో వివిధ భాషల్లో కలిపి 23 కోట్ల గ్రాస్, 21 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో మొత్తంగా 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికా, కెనడాలో కలిపి మొత్తంగా 1175 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే 2000 కోట్ల క్లబ్‌లో చేరనున్నది.


Click it and Unblock the Notifications











