The Girlfriend Closing Collection: ది గర్ల్‌ఫ్రెండ్ క్లోజింగ్ కలెక్షన్స్.. రష్మిక మందన్న మూవీకి లాభమా? నష్టమా?

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌‌ పోషించగా.. దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. నవంబర్ 7న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రష్మిక మందన్న మూవీకి లాభమెంత? నష్టమెంత? అన్నది పరిశీలిస్తే.....

ది గర్ల్‌ఫ్రెండ్ బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రష్మిక మందన్న స్టార్‌డమ్‌తో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ది గర్ల్‌ఫ్రెండ్‌పై హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయల చొప్పున పలికినట్లుగా టాలీవుడ్ టాక్. దాంతో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

The Girlfriend Box Office Closing Collections Worldwide How much loss or profit for Rashmika Mandanna s Movie

ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజున ఇండియా వైడ్‌గా 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1. 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.3 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.6 కోట్ల రూపాయలు, పదో రోజున 1.6 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 50 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 50 లక్షల రూపాయలు, పదమూడో రోజున 45 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 38 లక్షల రూపాయలు, పదిహేనో రోజున 16 లక్షల రూపాయలు, పదహారో రోజున 30 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 17.9 కోట్ల రూపాయల నెట్... 20.88 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడం, రష్మిక మందన్న క్రేజ్ దృష్ట్యా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు మంచి వసూళ్లు లభించాయి. నవంబర్ 19వ తేదీ వరకు నార్త్ అమెరికాలో ఈ సినిమాకు 691K డాలర్లు వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతుండగా.. ఇప్పుడు ఈ మొత్తం 700K డాలర్లు (భారత కరెన్సీలో 6.27 కోట్ల రూపాయలు) వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ తదితర దేశాలలో రష్మిక మందన్న మూవీకి కోటి రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవరాల్‌గా ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి 7.25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ది గర్ల్ ఫ్రెండ్‌కు వరల్డ్ వైడ్‌గా 28.08 కోట్ల రూపాయలు వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.3 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.1 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 98 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 1.57 కోట్ల రూపాయలు, పదో రోజున 1.57 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 49 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 49 లక్షల రూపాయలు, పదమూడవ రోజున 44 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 37 లక్షల రూపాయలు, పదిహేనో రోజున 16 లక్షల రూపాయలు, పదహారో రోజున 28 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి కర్ణాటకలో 3.50 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 17.40 కోట్ల రూపాయలు, తమిళనాడులో 75 లక్షల రూపాయలు, కేరళలో 10 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 70 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.

ది గర్ల్‌ఫ్రెండ్‌కు లాభమెంత? నష్టమెంత?
యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర, థామా వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ తర్వాత రష్మిక మందన్న నటించిన చిత్రం కావడంతో ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వసూళ్లపరంగా సంచలనాలు సృష్టించలేదు. ఓవరాల్‌ కలెక్షన్స్‌తో బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌కు అడుగుదూరంలో నిలిచింది ఈ చిత్రం. ఓవరాల్‌గా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 29 కోట్ల రూపాయలు రాబట్టి స్వల్ప నష్టాలతో బయటపడినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలో రష్మిక మందన్న మూవీ బ్రేక్‌ఈవెన్ కావడంతో పాటు లాభాలను కూడా అందించినట్లుగా తెలుస్తోంది. అయితే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఓటీటీ రైట్స్, డబ్బింగ్ రైట్స్‌తో నిర్మాతలు భారీ లాభాలను అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X