The Girlfriend Day 1 Collections: ది గర్ల్‌ఫ్రెండ్‌‌ తొలి రోజు కలెక్షన్స్.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?

ఈ ఏడాది ఛావా, సికందర్, కుబేర, థామా వంటి వరుస బ్లాక్‌‌బస్టర్స్‌తో ఊపు మీదున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

The Girlfriend Day 1 expected Box Office Collections Worldwide Rashmika Mandanna s movie good start at GBOC

ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ బిజినెస్
రష్మిక మందన్న స్టార్‌డమ్‌తో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ది గర్ల్‌ఫ్రెండ్‌పై హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయల చొప్పున పలికినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే.. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ది గర్ల్‌ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రిలీజ్‌కు ముందు నుంచే ఉన్న హైప్ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌కు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి దాదాపు 50K (భారత కరెన్సీలో 44.34 లక్షల రూపాయలు) డాలర్లు వచ్చినట్లు ఓవర్సీస్‌లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. ఇక యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్, గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ది గర్ల్ ఫ్రెండ్‌కు తొలిరోజు కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ది గర్ల్‌ఫ్రెండ్ తొలిరోజు కలెక్షన్స్
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి నవంబర్ 6వ తేదీ రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో రష్మిక మందన్న మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రష్మిక మందన్న మూవీకి తెలుగు వెర్షన్‌లో 13 శాతం, హిందీలో 7 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X