The Girlfriend Day 2 Collections: రెండో రోజు రష్మిక జోరు.. ది గర్ల్ ఫ్రెండ్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?

నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయల్ని నిర్మాతలు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

The Girlfriend Day 2 expected Box Office Collections Worldwide Rashmika Mandanna s movie registered significant growth

ది గర్ల్ ఫ్రెండ్ తొలి రోజు కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు ఇండియా వైడ్‌‌‌గా ప్రీమియర్స్‌తో కలిపి 1.3 కోట్ల రూపాయల నెట్.. 1.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో 1.25 కోట్ల రూపాయలు, హిందీలో 10 లక్షల రూపాయలు, తమిళనాడు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 15 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.

ది గర్ల్‌ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
రష్మిక మందన్న చిత్రాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. దానికి తగినట్లుగానే ది గర్ల్‌ఫ్రెండ్‌కు అడ్వాన్స్ బుకింగ్‌ దుమ్మురేపింది. ఒక్క అమెరికాలోనే అడ్వాన్స్ సేల్స్ ద్వారానే 26K డాలర్లు (భారత కరెన్సీలో 23 లక్షల రూపాయలు) రాబట్టింది. తొలి రోజు యూఎస్ఏ, కెనడాలలో కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 125K డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1.10 కోట్ల రూపాయలు) ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్, గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ది గర్ల్ ఫ్రెండ్‌కు తొలిరోజు కోటి 30 లక్షల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి రష్మిక మందన్న మూవీ 3 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ది గర్ల్‌ఫ్రెండ్ రెండో రోజు కలెక్షన్స్
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రెండో రోజు సాలీడ్ బుకింగ్స్ నమోదవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజును మించి రెండో రోజు కలెక్షన్ పెరుగుతాయని భావిస్తున్నారు. రెండో రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు రష్మిక మందన్న మూవీకి తెలుగు వెర్షన్‌లో 26 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X