The Girlfriend Day 3 Collections: ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్.. మూడో రోజు రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
రష్మిక మందన్న, అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ పోషించిన ప్రేమ కథా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. రావు రమేష్, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం మూడో రోజున వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ది గర్ల్ ఫ్రెండ్ రెండు రోజుల కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు ఇండియా వైడ్‌గా ప్రీమియర్స్‌తో కలిపి 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.5 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 3.8 కోట్ల రూపాయల నెట్.. 4.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.4 కోట్ల రూపాయలు చొప్పున రెండు రోజుల్లో 3.63 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు హిందీలో 30 లక్షల రూపాయలు, తమిళనాడులో 10 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
ది గర్ల్‌ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
రష్మిక మందన్న చిత్రానికి నార్త్ అమెరికా తదితర దేశాలలో మంచి వసూళ్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇప్పటికే 200K డాలర్ల క్లబ్‌లో (భారత కరెన్సీలో 1.78 కోట్ల రూపాయలు) చేరినట్లు ఈ సినిమాకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఇక యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో 50 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 2.20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రెండ్రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 6.60 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
ది గర్ల్‌ఫ్రెండ్ మూడోరోజు కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు షాకింగ్ ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. వీకెండ్ కావడంతో ఆదివారం ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. మూడో రోజు సాయంత్రం 4 గంటల వరకు రష్మిక మందన్న మూవీకి 22 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరుగుతాయని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దాంతో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో కలిపి రష్మిక మందన్న మూవీ ఈ వీకెండ్‌తో 10 కోట్ల రూపాయల మార్క్ చేరుకున అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











