The Girlfriend Day 4 Collections: భారీగా పడిపోయిన ది గర్ల్‌ఫ్రెండ్ వసూళ్లు.. రష్మిక మూవీ లాభాల్లోకి రావాలంటే?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. రష్మిక మందన్న, అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకత్వం వహించగా. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

ది గర్ల్ ఫ్రెండ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

The Girlfriend Day 4 expected Box Office Collections Worldwide Rashmika Mandanna s movie face huge drop on first monday

ది గర్ల్ ఫ్రెండ్ మూడు రోజుల కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు ఇండియా వైడ్‌‌‌గా ప్రీమియర్స్‌తో కలిపి 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.55 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.1 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 6.95 కోట్ల రూపాయల నెట్.. 8.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.45 కోట్ల రూపాయలు, మూడో రోజున 3 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 6.68 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు హిందీలో 45 లక్షల రూపాయలు, తమిళనాడులో 20 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

ది గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ఇప్పటికే 200K డాలర్ల క్లబ్‌లో చేరిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఆదివారం మరింతగా రెచ్చిపోయింది. ఏకంగా 125K డాలర్లు (భారత కరెన్సీలో 1.10 కోట్ల రూపాయలు) రాబట్టింది. దాంతో మొత్తంగా నార్త్ అమెరికాలో మూడు రోజుల వరకు ఈ సినిమాకు 325K డాలర్లు ( భారత కరెన్సీలో 2.88 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ఈ సినిమాకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఇక నార్త్ అమెరికాను మినహాయి మిగిలిన దేశాలలో 60 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 3.20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మూడు రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 11.40 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

ది గర్ల్‌ఫ్రెండ్ నాలుగో రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు నెట్టుకొచ్చిన రష్మిక మందన్న చిత్రానికి సోమవారం నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. వర్కింగ్ డేస్ కావడంతో సోమవారం ఉదయం నుంచే బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. నాలుగో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 15 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నాలుగో రోజు ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావొచ్చని భావిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 18 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X