The Girlfriend Day 5 Collections: రష్మిక మూవీకి దారుణంగా కలెక్షన్స్.. ది గర్ల్ ఫ్రెండ్‌కి ఎన్ని కోట్లంటే?

రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ త్వరలో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకత్వం వహించగా. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

The Girlfriend Day 5 expected Box Office Collections Worldwide Rashmika Mandanna s movie facing struggles

ది గర్ల్ ఫ్రెండ్ నాలుగు రోజుల కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు ఇండియా వైడ్‌‌‌గా ప్రీమియర్స్‌తో కలిపి 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.55 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 83 లక్షల రూపాయలు చొప్పున నాలుగు రోజుల్లో 7.23 కోట్ల రూపాయల నెట్.. 8.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.45 కోట్ల రూపాయలు, మూడో రోజున 3 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 83 లక్షల రూపాయలు చొప్పున నాలుగు రోజుల్లో 7.40 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు హిందీలో 45 లక్షల రూపాయలు, తమిళనాడులో 20 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

ది గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి నార్త్ అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఎన్ఆర్ఐ ఆడియన్స్‌కు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ 400K డాలర్లు (భారత కరెన్సీలో 3.54 కోట్ల రూపాయలు) మార్క్‌ని క్రాస్ చేసినట్లు ది గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఈ వసూళ్లతో నార్త్ అమెరికాలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం బ్రేక్ ఈవెన్ అయినట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇతర దేశాలైన యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో 65 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 4.10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి నాలుగు రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 12.70 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

ది గర్ల్‌ఫ్రెండ్ ఐదో రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు నెట్టుకొచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ .. సోమవారం వర్కింగ్ డే టెస్ట్‌లో ఫెయిలైంది. నాలుగో రోజు అతి తక్కువ 83 లక్షలు మాత్రమే రాబట్టిన రష్మిక మందన్న మూవీ.. మంగళవారం మరింత వీకైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఐదో రోజు సాయంత్రం 5 గంటల వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 20 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ మాత్రమే నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో ఐదో రోజు రష్మిక మందన్న మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 17 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X