The Girlfriend Day 6 Collections: నిలకడగా ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్.. రష్మిక మందన్న మూవీకి ఎన్ని కోట్లంటే?
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. పుష్ప 2, ఛావా, కుబేర, థామా చిత్రాల తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో నటించడంతో ది గర్ల్ ఫ్రెండ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకత్వం వహించగా. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరో రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ది గర్ల్ ఫ్రెండ్ ఐదు రోజుల కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు ఇండియా వైడ్‌గా ప్రీమియర్స్‌తో కలిపి 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.3 కోట్ల రూపాయలు చొప్పున ఐదో రోజుల్లో 8.85 కోట్ల రూపాయల నెట్..10.45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.3 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.27 కోట్ల రూపాయలు చొప్పున ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణలలో 8.5 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 57 లక్షల రూపాయలు, తమిళనాడులో 30 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1.73 కోట్ల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
ది గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అక్కడ కేవలం నాలుగు రోజుల్లోనే రష్మిక మందన్న మూవీ 400K డాలర్లు (భారత కరెన్సీలో 3.54 కోట్ల రూపాయలు) మార్క్‌ని క్రాస్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఐదో రోజు రాత్రి 7 గంటల వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 97K డాలర్లు (భారత కరెన్సీలో 86 లక్షల రూపాయలు) వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో 5 రోజుల వరకు ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి నార్త్ అమెరికాలో 500K డాలర్లు ( భారత కరెన్సీలో 4.43 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ప్రత్యంగిరా మూవీస్ వెల్లడించింది.
ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో ఈ చిత్రానికి 80 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 5.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఐదు రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 15.25 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం 5 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 20.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా పలువురు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ది గర్ల్‌ఫ్రెండ్ ఆరో రోజు కలెక్షన్స్
ది గర్ల్ ఫ్రెండ్ మూవీని రష్మిక మందన్న తన చరిష్మాతో నెట్టుకొస్తున్నారు. వర్కింగ్ డేస్‌లోనూ నిలకడగా వసూళ్లు రాబడుతోంది ఈ సినిమా. మార్నింగ్ షో, మ్యాట్నీ వరకు డల్‌గా ఉన్నప్పటికీ ఫస్ట్ షో, సెకండ్ షోలు మంచి ఆక్యూపెన్సీ నమోదు చేస్తున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆరో రోజు సాయంత్రం 5 గంటల వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. దాంతో ఆరో రోజు రష్మిక మందన్న మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి 50 లక్షల రూపాయల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











