The Girlfriend Day 7 Collections: రష్మికకు టఫ్ ఫైట్... ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్‌గా నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకత్వం వహించగా. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. నవంబర్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏడో రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

The Girlfriend Day 7 expected Box Office Collections Worldwide Rashmika Mandanna s movie heading for a closing

ది గర్ల్ ఫ్రెండ్ ఆరు రోజుల కలెక్షన్స్
రష్మిక మందన్న మూవీకి తొలి రోజు ఇండియా వైడ్‌‌‌గా ప్రీమియర్స్‌తో కలిపి 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.7 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.25 కోట్ల రూపాయలు చొప్పున ఆరు రోజుల్లో 10.1 కోట్ల రూపాయల నెట్..11.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.3 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.2 కోట్ల రూపాయలు చొప్పున ఆరు రోజుల్లో ఏపీ, తెలంగాణలలో 9.7 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 75 లక్షల రూపాయలు, తమిళనాడులో 45 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1.95 కోట్ల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

ది గర్ల్ ఫ్రెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎదురులేకుండా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో సమానంగా రష్మిక మందన్న మూవీని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 5 రోజుల్లోనే ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీకి నార్త్ అమెరికాలో 500K డాలర్లు ( భారత కరెన్సీలో 4.43 కోట్ల రూపాయలు) వసూలైంది. ఆరో రోజు సాయంత్రం 7 గంటల వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి నార్త్ అమెరికాలో 550K డాలర్లు ( భారత కరెన్సీలో 4.87 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ వచ్చినట్లు ఓవర్సీస్‌లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ప్రత్యంగిరా మూవీస్ వెల్లడించింది.

ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 6.30 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఆరు రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 17.60 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఈ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం 5 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 20.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా నిర్మాతలు ప్రకటించారు.

ది గర్ల్‌ఫ్రెండ్ 7వ రోజు కలెక్షన్స్
రూరల్ ఏరియాలలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి మిక్స్‌డ్ రిజల్ట్ రాగా.. అర్బన్ ఏరియాలలో మాత్రం రష్మిక మందన్న మూవీకి నిలకడగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవరాల్‌గా రోజుకు కోటి రూపాయలు తగ్గకుండా ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఏడో రోజు సాయంత్రం 4 గంటల వరకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. దాంతో ఏడో రోజు రష్మిక మందన్న మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 9 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్ నటించిన కాంత, హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ చిత్రంతో పాటు చిన్నా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X