The GirlFriend Oveseas Collection: ఓవర్సీస్‌లో రష్మిక హవా.. ది గర్ల్ ఫ్రెండ్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?

వరుస విజయాలతో జోరు మీదున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విద్య కోప్పినీడు నిర్మించారు. ఇండియాతో సమానంగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ది గర్ల్‌ఫ్రెండ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు రష్మిక మందన్న మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ది గర్ల్‌ఫ్రెండ్ బడ్జెట్ ఎంత?
ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

The Girlfriend Oveseas Collection Rashmika Mandanna s movie Crosses 200K in North America

ది గర్ల్‌ఫ్రెండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో 350 స్క్రీన్‌లలో, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్‌లలో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్
ఇండియాలో ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 1.3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.5 కోట్ల రూపాయలు చొప్పున రెండు రోజుల్లో 3.8 కోట్ల రూపాయల నెట్.. 4.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 1.23 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.4 కోట్ల రూపాయలు చొప్పున రెండు రోజుల్లో 3.63 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు హిందీలో 30 లక్షల రూపాయలు, తమిళనాడులో 10 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు వచ్చాయి.

ఓవర్సీస్‌లో ది గర్ల్‌ఫ్రెండ్ వసూళ్లు
అడ్వాన్స్ బుకింగ్‌లోనే ది గర్ల్‌ఫ్రెండ్‌కు ఇక్కడ మెరుగైన కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్స్ సేల్స్‌కు గాను నార్త్ అమెరికాలో రష్మిక మందన్న చిత్రం 26K డాలర్లు (భారత కరెన్సీలో 23 లక్షల రూపాయలు) రాబట్టింది. తొలి రోజున 81K (భారత కరెన్సీలో దాదాపు 80 లక్షల రూపాయలు), రెండో రోజున ఊహించని వసూళ్లు వచ్చాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో రెండో రోజున రష్మిక మందన్న మూవీకి నార్త్ అమెరికాలో 117K డాలర్లు (భారత కరెన్సీలో 1.3 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. దాంతో రెండ్రోజుల్లోనే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నార్త్ అమెరికాలో 200K డాలర్లు (భారత కరెన్సీలో 1.78 కోట్ల రూపాయలు) రాబట్టింది. నార్త్ అమెరికాలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే 400K డాలర్లు (భారత కరెన్సీలో 3.55 కోట్ల రూపాయలు) వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. ఈ సినిమా జోరు చూస్తుంటే ఈ వీకెండ్‌లోనే 80 శాతం రికవరీ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 50 లక్షల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవర్సీస్‌లో రెండు రోజుల్లో రష్మిక మందన్న మూవీకి 2.20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 6.60 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X