The GOAT Closing Collections: తెలుగు రాష్ట్రాల్లో భారీ డిజాస్టర్‌గా విజయ్ మూవీ.. ఎన్ని కోట్ల నష్టమంటే?
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ ది టైమ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన ఫలితాన్ని అందుకొన్నది. ఇప్పటి వరకు విజయ్ నటించిన చిత్రాల్లో ఈ సినిమా అతి దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విజయ్‌తోపాటు మీనాక్షి చౌదరీ, స్నేహా, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ తదితరులు నటించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత చేయాల్సింది? మొత్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ది గోట్ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మాతలు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ విడుదల చేశారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేరకు అమ్మారు. దాంతో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

ది గోట్ సినిమా ఆంధ్రా, నైజాం రాష్ట్రాల్లో తొలి రోజు భారీగానే వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఫస్ట్ డే 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత ఈ సినిమా టాక్ నెగిటివ్‌గా మారడం, తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో కలెక్షన్లపై దెబ్బ పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయింది. ఇక రెండో రోజు 1.5 కోట్లు, 3వ రోజు 2 కోట్లు, 4వ రోజు 1.5 కోట్ల రూపాయల రాబట్టింది. తొలి వారాంతంలో ఈ సినిమా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ మూవీ 5వ రోజు మరీ దారుణంగా 80 లక్షలు, 6వ రోజు 1 కోటి రూపాయలు, 7వ రోజు 70 లక్షలు వసూలు చేసింది. ఇక 8వ రోజు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఈ సినిమా 11 కోట్లు నికరంగా 18 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. తొలివారం దాదాపు అన్ని థియేటర్ల నుంచి తుడుచుకుపెట్టుకుపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా భారీగా నష్టపోయింది. 20 కోట్ల రూపాయలకు కనీసం 10 కోట్ల షేర్ కూడా రాబట్టలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకుపైగా నష్టాలను కూడగట్టుకొన్నది. ఇటీవల కాలంలో ఓ స్టార్ హీరో సినిమా ఇలాంటి నష్టాలను చవి చూడటంపై డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు గురి అవుతున్నారు.
ఇదిలా ఉండగా, గత 8వ రోజుల్లో ఈ సినిమా తమిళనాడు, ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో 140 కోట్ల రూపాయలు నికరంగా, ఓవర్సీస్‌లో 130 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో 23.55 కోట్లు, కేరళలో 12 కోట్లు, హిందీలో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 340 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లతో ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











