The Goat Life Collections: చరిత్ర సృష్టించిన ఆడు జీవితం.. 150 కోట్లతో గ్రేటెస్ట్ మూవీ జాబితాలో!
మలయాళంలో అత్యధిక మంది పాఠకులు ఆదరించిన పుస్తకం ఆడుజీవితం ఆధారంగా వాస్తవ సంఘటనలతో రూపొందిన చిత్రం గోట్ ఆఫ్ లైఫ్ (ఆడు జీవితం). యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును నమోదు చేసుకొన్నది. ప్రముఖ దర్వకుడు బ్లెస్సీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో అమలాపాల్, జిమ్మి జీన్ లూయిస్, శోభా మోహన్, కేఆర్ గోకుల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ నిర్మించారు. మార్చి 28వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే అనే వివరాల్లోకి వెళితే..
ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీని స్టోరీ డిమాండ్ చేయడంతో పలుదేశాల్లో చిత్రీకరించారు. కోవిడ్ కారణంగా సినిమా ఆగిపోవడంతో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, ఏఆర్ రెహ్మాన్ తదితరులు, ఇతర సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 80 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు.

ఆడుజీవితం సినిమా తొలివారం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం మొదటి వారంలో 47 కోట్ల రూపాయలను, రెండోవారంలో 21 కోట్ల రూపాయలు, మూడో వారం 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగోవారంలో కూడా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 94 కోట్ల రూపాయలు రాబట్టింది.
ది గోట్ ఆఫ్ లైఫ్ చిత్రం పలు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో 74 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కన్నడలో 50 లక్షలు, హిందీలో 60 లక్షలు వసూలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో కలిపి 94 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ మూవీకి అమెరికా, గల్ఫ్, యూఏఈ, ఇతర దేశాల్లో భారీ ఆదరణ దక్కింది. ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో 7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే.. భారతీయ కరెన్సీలో ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 151 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఈ మూవీ 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం రెండు వారాల్లోనే భారీ లాభాల్లోకి వెళ్లింది. ఈ సినిమా సుమారుగా 50 కోట్లకుపైగా ప్రాఫిట్‌ను ఆర్జించి పెట్టింది. దాంతో పృథ్వీరాజ్ పడిన శ్రమకు ప్రతిఫలం దక్కిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.


Click it and Unblock the Notifications











